వైభవంగా సహస్ర కలశాభిషేకం
భక్తి ప్రపత్తులతో నదీ హారతి
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో మాఘమాసోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆది వారం సుందర రామయ్యకు సహస్ర కలశాభిషే కాన్ని కమనీయంగా నిర్వహించారు. తొలుత స్వా మివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలశాలలోని పంచామృత జలాలతో మంగళవాయిద్యాలు, మేళతాళాలు నడుమ ఆలయ ప్రదక్షిణ చేశా రు. ఆ తర్వాత బేడా మండపంలో కొలువుదీరిన శ్రీ సీతాలక్ష్మణ సమేత రామయ్య స్వామికి ఆవాహనం చేసిన కలశాలలోని జలాలతో అభిషేకం కనుల పండువగా జరిపారు. నక్షత్ర హారతి సమర్పించారు. సహస్ర కలశాభిషేక ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పూర్ణాహుతి జరిపారు. తెలిసీ తెలియక జరిగిన తప్పొప్పుల ప్రాయశ్చిత్తార్థం మాఘపౌర్ణమి రోజు న స్వామివారికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించటం ఆనవాయితీ అని వేదపండితులు ఉత్సవ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా స్వా మివారికి పవళింపు సేవ రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ కే దామోదర్‌రావు, ప్రధాన అర్చకులు, పండితులు పాల్గొన్నారు.
ఘనంగా రంగనాథ స్వామికల్యాణం
రామాలయానికి అనుబంధంగా ఉన్న రంగనాయకుల గుట్టపై వేంచేసియున్న శ్రీ రంగనాథ స్వామి కల్యాణం రమణీయంగా నిర్వహించారు. దేవస్థానం తరఫున రామాలయం నుంచి మేళతాళాల నడుమ ఽరంగనాయకుల గుట్టకు పట్టువస్త్రాలను, కల్యాణ సామగ్రిని తెచ్చి అందజేశారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, కంకణధారణ, మాంగళ్యధారణ, తలంబ్రాల కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. సహస్ర కలశాభిషేకోత్సవాన్ని పురస్కరించుకుని రెండు రోజులపాటు రద్దు చేసిన నిత్యకల్యాణాలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి
రామయ్య సన్నిధిలో అణుశక్తి కమిషన్ చైర్మన్
శ్రీ సీతారామ చంద్రస్వామివారిని అణుశక్తి కమిషన్ చైర్మన్ అజిత్ కుమార్ మహంతి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఈఓ దామోదర్‌రావు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులకు పూజలు చేశారు. ఉపాలయాల్లో పూజలు చేశాక పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఈఓ ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందచేశారు.
శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం
నిత్యాన్నదానానికి హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌కు చెందిన డాక్టర్ ఎన్.కవిత రూ.లక్ష విరాళం అందజేశారు. కాగా గత జనవరిలో స్వామి వారిని 2,92,369 మంది భక్తులు, గతేడాది జనవరిలో 2,72,335 మంది దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
భద్రాచలంలో గోదావరి మాతకు ఆది వారం భక్తిప్రపత్తులతో నదీ హారతి నిర్వహించారు. మాఘ(వ్యాస పూర్ణిమ)ను పురస్కరించుకుని ప్రత్యేక పూజలను, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులతో ప్రత్యేక భజన, భక్తి గీతాల కార్యక్రమం చేపట్టారు. గణపతి పూజ, జైశ్రీరామ్ అలంకారంలో 108 ప్రమిదలతో దీపోత్సవం, అష్టోత్తర శతనామార్చన చేశారు. అనంతరం రామయ్యకు, గోదావరి నదికి హారతి సమర్పించారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ఆయన సతీ మణి మనీషా, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, ఈఓ శ్రీనివాసరావు, దేవస్థానం ఈఈ రవీందర్ పాల్గొన్నారు.
నేటి నుంచి నిత్యకల్యాణాలు పునఃప్రారంభం
వైభవంగా సహస్ర కలశాభిషేకం


