వైభవంగా చండీ హోమం పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం చండీహోమం, విశేషపూజలు వైభవంగా నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని యాగశాలలో చండీహోమం పూజలుచేశారు. ముందుగా మేళతాళాలు, వేద మంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధ న, గణపతి పూజలు, చండీహోమం గావించారు. చివరన పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. చండీహోమం పూజలో పాల్గొ న్న 21 మంది భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు. ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ డైరెక్టర్లు, భక్తులు అర్చకులు పాల్గొన్నారు.
కిన్నెరసానిలో జలవిహారం
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 382మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.19,135 ఆదాయం లభించింది. 200 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.10,790 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
మాస్టర్ అథ్లెటిక్స్‌లో ప్రతిభ
దుమ్ముగూడెం: మండలంలోని పెదపాడు ఎంపీపీఎస్ పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయుడు కల్లూరి భద్రయ్య నేషనల్ అథ్లెటిక్స్‌లో లాంగ్‌జంప్‌లో రాణించి గోల్డ్‌మెడల్ సాధించాడు. రాజస్తాన్‌లో జరుగుతున్న మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్న ఆయన లాంగ్‌జంప్‌లో ప్రథమస్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా ఆయ న్ను పలువురు అభినందించారు.
నిరంతరాయంగా
ఉత్పత్తి జరగాలి
మణుగూరుటౌన్: బీటీపీఎస్‌లోనిరంతరాయం గా విద్యుత్ ఉత్పత్తి జరగాలని జెన్‌కో (థర్మల్) డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ప్లాంట్‌లో పర్యటించారు. నాలుగు యూనిట్ల పనితీరును పరిశీలించి మాట్లాడారు. రానున్న వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఉత్పత్తిలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. సాంకేతిక లోపాలను ముందుగానే గుర్తించి మరమ్మతులు చేపటాలన్నారు. సీఈ బిచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
ఏపీ రెవెన్యూ
కమిషనర్ పూజలు
ములకలపల్లి: ములకలపల్లిలోని ఉమా పృథ్వీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆదివా రం ఏపీ రెవెన్యూ శాఖ కమిషనర్ జే.వెంకట మురళి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ముకందల సత్యనారాయ శాస్త్రి, కృష్ణమోహన్ అభిషేకాలు నిర్వహించి, ఆశీర్వచనం అందజేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దుశ్శాలువతో కమిషనర్‌ను సత్కరించారు. కాగా వెంకటమురళి 2001లో ములకలపల్లి ఎస్సైగా పనిచేశారు. ఆ తర్వాత సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించి ఆంధ్రాకు వెళ్లారు. ఆలయంలో పూజల అనంతరం గ్రామస్తులు, పోలీస్ సిబ్బందితో ముచ్చటించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ నరాటి ప్రసాద్, సభ్యులు పువ్వాల మంగపతి, శనగపాటి సీతారాములు, కొదుమూరి గోపాల్, పీఏసీఎస్ సీఈఓ కుంచారపు శ్రీని వాస్, ఉపసర్పంచ్ పువ్వాల లలితారావు, మేకల పెద్దవెంకన్న, ఊకంటి రవికుమార్, డాక్టర్ గోపీ, శ్రీరాముల నాగేశ్వరరావు, బిక్కుమళ్ల వేణు, పద్దం బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా చండీ హోమం పూజలు


