మధిర వాసికి అరుదైన గౌరవం
మధిర: మధిరకు అరుదైన గౌరవం దక్కింది. పట్టణానికి చెందిన గడ్డమణుగు చంద్రమౌళి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. పట్టణంలోని రామాలయం వీధిలో నివాసం ఉండే సత్యనారాయణరావు – సరస్వతీదేవి దంపతులకు 1958 నవంబర్ 9న జన్మించిన చంద్రమౌళి ఇంట ర్మీడియట్ వరకు మధిరలోనే చదివారు. వరంగల్ ఎన్‌ఐటీలో బీటెక్, ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్, ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. డీఆర్డీఓలో 34 ఏళ్ల పాటు సమర్థవంతంగా విధులు నిర్వహించి దేశ రక్షణ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఆకాశ్ క్షిపణి ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆకాష్ క్షిపణి వ్యవస్థను తయారు చేసే బాధ్యతను ప్రముఖ శాస్త్రవేత్త ప్రహ్లాద్ రామారావుకు అప్పగించినప్పుడు, ముగ్గురు సభ్యులతో కూడిన తొలి బృందంలో చంద్రమౌళి కూడా ఉన్నారు. అవార్డుకు ఎంపికై న సందర్భంగా చంద్రమౌళి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. మొబైల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ప్రయోగించే ఆకాశ్ క్షిపణి.. ఫైటర్ జెట్‌లు, చాపర్‌లు, యూఏవీలు, సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, సూపర్‌సోనిక్ స్పీడ్‌తో కూడిన స్మార్ట్ బాంబులు, ఎత్తు లేదా పరిమాణంతో సంబంధం లేకుండా ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ ఫంక్షన్లతో సహా అనేక రకాల లక్ష్యాలను ఏకకాలంలో తటస్థీకరించగలదని చెప్పారు.
చంద్రమౌళికి పద్మశ్రీ అవార్డు


