
డ్రోన్‌తో యూరియా పిచికారీ చేయాలి
టేకులపల్లి : ద్రవరూపంలో ఉండే నానో యూరియాను డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడం మేలని, ఎకరాకు 500 ఎంఎల్ వాడడంతో ఖర్చు కూడా తగ్గుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.బాబూరావు, ఆత్మ డీపీడీ బి.సరిత రైతులకు సూచించారు. నానో యూరియా, నానో డీఏపీ వినియోగంపై టేకులపల్లిలో మంగళవారం వారు అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ.. నానో యూరియాతో పంటల దిగుబడి పెరుగుతుందని, తక్కువ మోతాదులో వాడినా ఫలితం ఉంటుందని, పర్యావరణానికి మేలు చేస్తుందని, ఖర్చు తగ్గడంతో పాటు పంట నాణ్యత మెరుగుపడుతుందని వివరించారు. నానో యూరియా కణాలు చాలా చిన్నవిగా ఉండడంతో మొక్కల కణజాలంలోకి తేలికగా ప్రవేశించి, నత్రజనిని సమర్థవంతంగా అందిస్తాయని, మొక్కలకు అవసరమైన పోషకాలు సకాలంలో అందడంతో దిగుబడి పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఏడీఏ గుగులోత్ లాల్‌చంద్, ఏఓ నీరుడు అన్నపూర్ణ, ఏఈఓ శ్రావణి పాల్గొన్నారు.
రైతులకు డీఏఓ
బాబూరావు సూచన