చర్ల: మండలంలోని ఉంజుపల్లిరోడ్‌లో మంగళవారం కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ముందు చక్రం టైరు పంక్చర్ అయ్యి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఒకరు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ పరిధిలోని కమలాపురానికి చెందిన కొందరు ఆదివాసీలు వెంకటచెరువులోని బంధువుల ఇళ్లల్లో ఉంటూ మండలంలోని వివిధ గ్రామాలకు కూలీ పనులకు వెళ్తున్నారు. వారు ట్రాక్టర్‌లో వెంకటచెరువు నుంచి చీమలపాడుకు వెళ్తుండగా దేవరబండ సమీపంలో ట్రాక్టర్ ముందు చక్రం టైరు పంక్చర్ అయి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కమలాపురానికి చెందిన సోడి లక్మ గాయపడగా.. 108 ద్వారా చర్ల ప్రభుత్వ వైద్యశాలకు.. అక్కడి నుంచి భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు.
అదుపుతప్పి చెట్టుకు ఢీ