నూజెండ్ల: ఎంపీటీసీ నామినేషన్లు ప్రక్రియలో ఎస్‌ఐ బీవీ కృష్ణారావు అత్యుత్సాహం చూపారు. కూటమి నేతల అండదండలతో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. నామినేషను వేయించే ప్రసక్తే లేదు అంటూ తీవ్ర అసభ్య పదజాలంతో హెచ్చరించారు. కూటమి నేతలు, పోలీసులు కుమ్మకై కేవలం వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవటం జరిగింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతలు ప్రశ్నించగా వాగ్వావాదం చోటుచేసు కొంది. ఇరుపార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఎస్సై బీవీ కృష్ణారావు ఇరుపార్టీల వారిపై చర్యలు తీసుకోకుండా కేవలం వైఎస్సార్ సీపీ నేతలపై లాఠీచార్జి చేశారు.
నామినేషన్లకేంద్రంలో ఆంక్షలు
ఎంపీటీసీ నామినేషన్లు ప్రక్రియ న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులు పట్ల పోలీసులు అత్యుత్సాహం చూపిన సంఘటన నూజెండ్లలో గురువారం చోటుచేసుకుంది. వి వరాల మేరకు వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు నామినేషన్లు వేసేందుకు ఆర్వో వద్దకు వస్తున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడి యా ప్రతినిధులు కవరేజ్ చేసుకునేందుకు ఆర్వో అనుమతులు ఇచ్చినా పోలీసులు మా త్రం ఆంక్షలు విధించారు. దీంతో స్థానిక ఎస్సై బీవీ కృష్ణారావు తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నామినేషన్ కేంద్రం ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


