అగ్రి కళాశాలకు ర్యాంకుల పంట | - | Sakshi
Sakshi News home page

అగ్రి కళాశాలకు ర్యాంకుల పంట

Oct 23 2026 2:09 AM | Updated on Oct 23 2026 2:09 AM

జాతీయస్థాయి వ్యవసాయ పీజీ ప్రవేశ పరీక్షలో

బాపట్ల: విద్యా బోధనలో బాపట్ల వ్యవసాయ కళాశాల అత్యున్నత ప్రమాణాలను పాటిస్తుందని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డా.పి.ప్రసూన రాణి అన్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ అఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ జూనియర్‌ ఫెలోషిప్‌ (ఐ.సి.ఏ.ఆర్‌.–జె.ఆర్‌.ఎఫ్‌.) పరీక్షలో బాపట్ల వ్యవసాయ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ర్యాంకులు సాధించిన సందర్భంగా గురువారం అభినందన సభ నిర్వహించారు. డీన్‌ డాక్టర్‌ పి.ప్రసూనరాణి మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యతోపాటు విద్యార్థులకు సాంకేతికత, నైపుణ్యతలను పెంపొందించేందుకు కృషి చేస్తుందని, ప్రతి యేటా జాతీయ స్థాయి పి.జి. ప్రవేశ పరీక్షా ఫలితాలలో కళాశాల విద్యార్థులు సాధిస్తున్న ఉత్తమ ర్యాంకులే అందుకు నిదర్శనమన్నారు. అంతేకాకుండా ఐ.సి.ఏ.ఆర్‌.–జె.ఆర్‌.ఎఫ్‌ ద్వారా ఉన్నత విద్య పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ సైంటిస్ట్‌ పరీక్షలలో, యూనివర్సిటీలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల నియామకాల్లో జాతీయ అంతర్జాతీయ పరిశోధన ప్రాజెక్టులలో ప్రాధాన్యత లభిస్తుందన్నారు. జాతీయ స్థాయిలో 20 వ ర్యాంకు సాధించి ఐ.ఏ.ఆర్‌.ఐ, న్యూ ఢిల్లీలో బయో కెమిస్ట్రీ విభాగంలో సీటు పొందిన పి.ఉదయ లక్ష్మి, ఎస్సీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 10 వ ర్యాంకు సాధించి, జార్ఖండ్‌ రాష్ట్రంలోని ఐ.ఏ.ఆర్‌.ఐ. హజారీబాగ్‌, రాంచి క్యాంపస్‌లో సాయిల్‌ సైన్స్‌ విభాగంలో సీటు పొందిన జి.ప్రవల్లికలను ఘనంగా సత్కరించారు. వీరితో పాటు, డి.అభిమన్యు 12 వ ర్యాంకుతో యు.ఏ.ఎస్‌., బెంగళూరులో అగ్రిబిజినెస్‌ మేనేజిమెంట్‌ విభాగంలోను, సోనాక్షి గుప్త 32వ ర్యాంకు సాధించి బీహార్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీట్లు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జె.ఆర్‌.ఎఫ్‌. కోచింగ్‌ సెల్‌ ఇన్‌చార్జీ డా.ఎస్‌.హైమ జ్యోతి, సీనియర్‌ ప్రొఫెసర్‌ డా.జి.శివనారాయణ, డా. కె.చంద్రశేఖర్‌, డా.లాల్‌ అహమద్‌ మొహమ్మద్‌, డా.కె.సుశీల, డా.వి.ప్రసన్న కుమారి వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement