రాజ్యాంగబద్ధంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగబద్ధంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు

Oct 22 2026 7:14 AM | Updated on Oct 22 2026 7:14 AM

బాపట్ల: రాజ్యాంగబద్ధంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల వ్యయ పరిశీలకురాలు జి.కృష్ణప్రియ అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్‌ వీక్షణ సమావేశ మందిరంలో రాజకీయపార్టీల నాయకులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభం నుంచి పోటీలో ఉండే అభ్యర్థుల ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అభ్యర్థులు వెచ్చించే ప్రతి పైసాకు ఖర్చులు చూపాల్సి ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు వరకు అభ్యర్థుల వ్యయాన్ని గుర్తించడానికి నియమించిన బృందాలు నిరంతరం పరిశీలిస్తాయన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేయాల్సిందేనన్నారు. ప్రతి అభ్యర్థికి ఒక రిజిస్టర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మూడు రోజులకొకసారి సంబంధిత దస్త్రాన్ని వ్యయ పరిశీలకులు పరిశీలిస్తారన్నారు. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు 40 రోజుల్లో తమ ఖర్చులపై స్పష్టమైన నివేదికలు ఎన్నికల వ్యయ పరిశీలకులకు అందించాల్సి ఉందన్నారు. లేకుంటే నిబంధనల ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం కింద భావించాల్సి ఉంటుందన్నారు.

బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు చర్యలు

మున్సిపాలిటీ ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. పురపాలక సంఘాల పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా బుధవారం విడుదల చేస్తామన్నారు. వీటి ఆధారంగా బ్యాలెట్‌ పత్రాలు ముద్రించే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. పురపాలక సంఘాలలో పోటీలో ఉండే అభ్యర్థులు స్పష్టత ఉంటుందన్నారు. ప్రచారాలను ఎప్పటికప్పుడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌ సర్వైలెనన్స్‌, వీడియో సర్వేలెన్స్‌ బృందాలు నిరంతరం పరిశీలిస్తాయన్నారు. డీఆర్వో లవన్న, డీపీఓ నగేష్‌కుమారి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు షేక్‌ షఫీ, జిల్లా వ్యయ నోడల్‌ ఆఫీసర్‌ రాజ్యం, వైఎస్సార్‌సీపీ నాయకులు ఇనగలూరి మాల్యాద్రి, సీపీఎం నాయకులు గంగయ్య, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డి.రవి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు బాలాజీరెడ్డి, టీడీపీ నాయకులు వహీద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల వ్యయ పరిశీలకురాలు జి.కృష్ణప్రియ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement