పైప్‌లైన్‌ను ఢీకొన్న కారు | - | Sakshi
Sakshi News home page

పైప్‌లైన్‌ను ఢీకొన్న కారు

Oct 22 2026 7:14 AM | Updated on Oct 22 2026 7:14 AM

యువకుడి మృతి

ఉప్పల్‌: ఉప్పల్‌ నుంచి నాగోల్‌ వెళ్లే మార్గంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న జంపాని వినీత్‌ చౌదరి (24) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం హయత్‌నగర్‌ పవనగిరి కాలనీకి చెందిన జంపాని నాగేశ్వరరావు వ్యాపారి. స్వస్థలం గుంటూరు. ఆయన చిన్న కుమారుడు వినీత్‌ చౌదరి(24) ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం అర్ధరాత్రి తార్నాకలో ఉండే స్నేహితుడు సయ్యద్‌ సాజీద్‌ అలి వద్దకు వచ్చారు. కాఫీ తాగడానికి బంజారాహిల్స్‌ వెళ్లారు. దాదాపు 3 గంటల సమయంలో స్నేహితుడిని తార్నాకలో దింపి ఎల్‌బీనగర్‌ వైపు వెళ్తున్నారు. నాగోల్‌ రోడ్డు హెచ్‌పీ పెట్రోల్‌ బంకు వద్ద కారు అదుపు తప్పి కృష్ణా జలాల పైప్‌లైన్‌ వాల్వ్‌ను బలంగా ఢీకొట్టింది. పైపులైన్‌ పగలడంతో నీటి వేగానికి కారు పైకి ఎగిరి పక్కన ఉన్న షాప్‌పై పడింది. ఈ ఘటనలో వినీత్‌ చౌదరి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నుజ్జునుజ్జు అయ్యింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఉదయం వరకు రోడ్డుపై భారీగా నీరు పారడంతో వాహన దారులు ఇబ్బంది పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement