తమ్ముళ్ల తిరుగుబావుటా! | - | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల తిరుగుబావుటా!

Oct 22 2026 7:02 AM | Updated on Oct 22 2026 7:02 AM

తమ్ముళ్ల తిరుగుబావుటా! కొల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికలు పచ్చ పార్టీకి కొరకరాని కొయ్యగా మారాయి. సొంత పార్టీలోని నాయకులే అసమ్మతి రాగం అందుకుంటుండటంతో అభ్యర్థుల ఖరారు ఓ పట్టాన తేలక నేతలు తలలు పట్టుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కోసం ఆశగా ఎదురు చూసిన ఆశావాహులు టికెట్‌ తమకు దక్కని పక్షంలో రెబల్స్‌గా పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేపట్టి అధిష్టానానికి సవాళ్లు విసురుతున్న విషయం ఆపార్టీలోనే చర్చానీయంశంగా మారింది. బుధవారం నుంచి నామినేషన్ల ఘట్టానికి తెర లేచినప్పటికీ, కొల్లూరు మండలంలో ఎంపీటీసీ స్థానాల్లో పోటీచేసేందుకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేయకపోవడం ఆపార్టీలో నెలకొన్న అంతర్గత పోరుకు అద్ధం పడుతుంది. ఎంపీటీసీ స్థానాలకు, జెడ్పీటీసీ స్థానానికి టికెట్ల కేటాయింపు విషయంలో టీడీపీలోని రెండు వర్గాలు తమ కంటే తమకంటూ పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఒకట్రెండు ఎంపీటీసీ స్థానాలలో టికెట్‌ ఆశించి భంగపడిన అభ్యర్థులు రెబల్స్‌గా నామినేషన్‌ దాఖలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంతోపాటు, స్థానికంగా బలాన్ని కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు ఆరంభించినట్లు పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంలో నెలకొన్న అనిచ్చితికి రెబల్స్‌ తిరుగుబాటు బావుటా ఎగురవేస్తారన్న కలవరపాటే కారణమని టీడీపీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఎవరి అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తే ఎవరు రెబల్‌గా ఎన్నికలలో నామినేషన్‌ దాఖలు చేస్తారోనన్న సంశయంతో పచ్చపార్టీ నేతలు తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం. దీనికి తగ్గట్టు రెండు ధపాలు కొల్లూరులో అభ్యర్థుల ఖరారు కోసం ఎమ్మెల్యే ఆనందబాబు సమావేశం ఏర్పాటు చేయడం, గుంటూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో నాయకులతో అంతర్గత చర్చలు నిర్వహించడం టీడీపీలో రెబల్స్‌ తిరగుబాటు స్వర తీవ్రతను తేటతెల్లం చేస్తుంది. కొల్లూరు మండల జెడ్పీటీసీ స్థానం కోసం పచ్చ గూటిలోని ఒకే సామాజక వర్గానికి చెందిన ఇరు వర్గాల నాయకులు పట్టు పడుతున్నారు. కొల్లూరు జెడ్పీటీసీ స్థానం జనరల్‌ మహిళకు కేటాయించడంతో ఇరువర్గాల నాయకులు తమ సతీమణులను రంగంలోకి దింపేందుకు సన్నద్ధం అయ్యారు. అందుకు తగ్గట్లు ఓ టీడీపీ నాయకుడు ఇప్పటికే తన భార్య పేరును తెరపైకి తీసుకు వచ్చి సొంత పార్టీతోపాటు, మిత్ర పక్ష పార్టీల నాయకులు, పలువురికి ఫోన్‌లు చేసి ఆమె గెలుపు కోసం సహకరించాలని మంతనాలు మొదలుపెట్టినట్లు సమాచారం. రెండో వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు సైతం తన భార్యకు జెడ్పీటీసీ అభ్యర్థిత్వం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. జెడ్పీటీసీ అభ్యర్థిత్వం మొదటి జెడ్పీటీసీ అభ్యర్థినిగా తెరపైకి వచ్చిన నాయకుడి భార్య ఖరారు అయిన పక్షంలో టీడీపీలో అంతర్గత పోరు తీవ్రతరమై రెబల్స్‌ తాకిడి అధిక మవుతుందని ఆపార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.

రెబల్స్‌గా బరిలో నిలిచేందుకు తెలుగు తమ్ముళ్లు సై..

స్థానిక సంస్థల ఎన్నికల్లో రెబల్స్‌గా బరిలో నిలిచి పచ్చ పార్టీకి తమ దమ్ము చూయించేందుకు తెలుగు తమ్ముళ్లు సై అంటున్నారు. కొల్లూరు మండలంలో టీడీపీలో ఉన్న రెండు వర్గాల నడుమ అభ్యర్థుల విషయంలో పోటాపోటీ వాతావరణం నెలకొంది. తమ వర్గంలోని వ్యక్తులకు టికెట్లు కేటాయించాలని ఓ వర్గం, తమ వర్గంలోని వారికి టికెట్లు కేటాయించాలని మరో వర్గం నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరు వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చి టిక్కెట్లు కేటాయించని పక్షంలో అన్ని ఎంపీటసీ స్థానాలతోపాటు, జెడ్పీటీసీ స్థానంలోనూ రెబల్స్‌ను బరిలోకి దింపేందుకు అవసరమైన ఏర్పాట్లను ఓ వర్గం నాయకులు ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి లోపు టికెట్ల కేటాయింపులో సమ న్యాయం దక్కని పక్షంలో రెబల్స్‌గా అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేయనున్నట్లు సమాచారం.

రెబల్స్‌ పోరుతో టీడీపీలో కలవరం

జెడ్పీటీసీ స్థానం కోసం పట్టు

పచ్చ పార్టీలో అసమ్మతి సెగ

తీవ్ర అసంతృప్తిలో

అభ్యర్థిత్వం దక్కని వారు

రెబల్స్‌గా పోటీలో నిలుస్తామంటూ

అధిష్టానానికి సవాళ్లు

రెబల్స్‌ గా బరిలోకి సిద్ధమవుతున్న

ఆశావాహులు

తలలు పట్టుకుంటున్న నేతలు

కొలిక్కిరాని అభ్యర్థుల ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement