శమీ శమయతే పాపం | - | Sakshi
Sakshi News home page

శమీ శమయతే పాపం

Oct 22 2026 7:02 AM | Updated on Oct 22 2026 7:02 AM

శమీ శమయతే పాపం 25న బాల్‌ బ్యాడ్మింటన్‌ జట్ల ఎంపిక రూ.5.63 లక్షల యూరియా, డీఏపీ అమ్మకాలు నిలిపివేత మల్లేశ్వరస్వామి సేవలో ట్రిబ్యునల్‌ చైర్‌పర్సన్‌ వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

అమరావతి: అమరారామంలో వేంచేసియున్న శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామిదేవస్థానంలో దసరా శరన్నవారాత్రోత్సవాలలో భాగంగా మంగళవారం విజయదశమినాడు రాత్రి 7గంటలకు చండీసమేత అమరేశ్వర స్వామికి పారువేట ఉత్సవం నిర్వహించారు. ఆలయంలోని రెండో ప్రాకారంలోని జమ్మిచెట్టు వద్ద శమీపూజను ఆలయస్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా అమరావతి క్షేత్రంలో శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా విజయదశమి రోజు మంగళవారం బాలచాముండేశ్వరి అమ్మవారిని రాజరాజేశ్వరీదేవిగా అలంకరించారు.

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): గుంటూరు జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు స్థానిక ఎన్జీఓ క్లబ్‌లో జిల్లా జూనియర్‌ బాల బాలికల జట్ల ఎంపికలు నిర్వహిస్తామని అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాస రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక చేసిన జట్లు నవంబర్‌లో జరగనున్న అంతర్‌ జిల్లాల బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొంటాయన్నారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు ఆధార్‌ కార్డుతోపాటు జనన ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని పోటీలు జరిగే ప్రాంతానికి రావాలన్నారు. క్రీడాకారులు జనవరి 2, 2007 లోపు జన్మించినవారై ఉండాలన్నారు. 9347785888 నెంబరులో సంప్రదించాలన్నారు.

నగరంపాలెం: బాపట్ల జిల్లా వేమూరులో సాయి ఎంటర్‌ప్రైజెస్‌ ఎరువులు, పురుగుమందుల దుకాణంలో బుధవారం ఉమ్మడి జిల్లా విజిలెనన్స్‌/ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగపు అధికారులు, మండల వ్యవసాయ అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. సరైన అనుమతి పత్రాలు లైసెన్‌న్స్‌లో నమోదు లేకపోవడాన్ని తనిఖీల్లో గుర్తించారు. దీంతో నిల్వ చేసిన రూ.5.63 లక్షలు విలువ చేసే 90 యూరియా బస్తాలు, 400 డీఏపీ బస్తాలు అమ్మకాలు నిలిపివేశారు. దుకాణపు యాజమానిపై చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

పెదకాకాని: మల్లేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఎండోమెంట్స్‌ ట్రిబ్యునల్‌ చైర్‌పర్సన్‌ ఎ భారతి విచ్చేశారు. శివాలయానికి మంగళవారం సాయంత్రం విచ్చేసిన ట్రిబ్యునల్‌ చైర్‌పర్సన్‌ ఎ భారతి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. భ్రమరాంబ మల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శమీ పూజలో పాల్గొన్నారు. దేవాలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం, స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో ఎక్స్‌అఫిషియో సభ్యుడు పేటేటి ధనమహేశ్వరప్రసాద్‌, ఆలయ వేదపండితులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ డివిజన్‌ పీఆర్‌ఓ నుస్రత్‌ మండ్రుప్కర్‌ బుధవారం ఒక ప్రకటలో తెలిపారు. గుంటూరు – కోల్‌కతా (07437) రైలు ఈ నెల 25, నవంబర్‌ ఒకటో తేదీన, కోల్‌కతా – గుంటూరు (07438) ఈ నెల 26, నవంబర్‌ రెండో తేదీ, విశాఖపట్నం – సికింద్రాబాద్‌ (08517) ఈ నెల 22, 25 తేదీల్లో, సికింద్రాబాద్‌ – విశాఖపట్నం (08518) ఈ నెల 23, 26 తేదీల్లో నడుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement