పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

21 నుంచి 23 వతేదీ వరకు నామినేషన్ల స్వీకరణ 27 నామినేషన్లు ఉపసంహరణ నవంబర్‌ 3న పోలింగ్‌, 5న ఫలితాలు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌

బాపట్ల: స్థానిక సంస్థలు ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైనట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్‌లోని బోర్డు రూమ్‌ నుంచి ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్‌ ఓలు, ఏఆర్వోలు నోడల్‌ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్‌న్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ, ఈనెల 27 నామినేషన్ల ఉపసంహరణ, నవంబర్‌ 3న పోలింగ్‌, నవంబర్‌ 5న ఫలితాలు విడుదల చేస్తారని తెలిపారు.

సర్టిఫికెట్లు వెంటనే మంజూరు చేయాలి

నామినేషన్లు వేసే వారికి అవసరమైన కుల, ఎన్‌ఓసీ సర్టిఫికెట్లు వెంటనే అందజేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. నామినేషన్‌ ప్రక్రియ జరిగేటప్పుడు వెబ్‌ కాస్టింగ్‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నామినేషన్‌ పత్రాలు అన్నింటిని స్కానింగ్‌ చేసుకోవాలన్నారు. స్కానింగ్‌ చేసిన అన్నింటిని జిల్లా కలెక్టరేట్‌కు పంపించాలని, ఆర్డీఓ కార్యాలయంలో కూడా కాపీ భద్రపర్చుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు. ఎంపీడీవోలు అందరూ ఎన్నికల మెటీరియల్‌ పంపిణీ, కౌంటింగ్‌ కేంద్రాల వివరాలు వాట్సాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్‌ఓ లవన్న, జెడ్పీ సీఈఓ సీహెచ్‌.విజయలక్ష్మి, గ్రామ వార్డుల సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్‌ యశ్వంత్‌, ఎలక్షన్‌ సెక్షన్‌ పర్యవేక్షకులు షఫీ తదితరులు పాల్గొన్నారు.

నిఘా ఉంచాలి

స్థానిక సంస్థల ఎన్నికలపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌ సర్వే లెన్సు బృందాల నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ తెలిపారు. వివిధ శాఖల అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ఆయన సమా వేశం నిర్వహించారు. బృందాలు విస్తృతంగా తనిఖీలు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎన్నికల పరిశీలకులు, జిల్లా అధికారులు, ఎన్నికల కోసం నియమితులైన ఆయా విభాగాల నోడల్‌ అధికారుల వాహనాలకు ప్రత్యేక స్టిక్కర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు గుర్తింపుకార్డులు జారీ చేయాలన్నారు. వెబ్‌ కాస్టింగ్‌ పక్కాగా నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రాధాన్యతను గుర్తించి అధికారులు విధులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, డీపీఓ డి నగేష్‌ కుమారి, సీపీఓ షాలేంరాజు, బాపట్ల మున్సిపల్‌ కమిషనర్‌ హాసిని, సమగ్ర శిక్ష అభియాన్‌ ఏపీసి డాక్టర్‌ శ్రీనివాసరావు, కలెక్టరేట్‌ ఏవో మల్లికార్జునరావు, స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల కోఆర్డినేటర్‌ పి.యశ్వంత్‌, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు షేక్‌ షఫీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement