ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన

రేపల్లె: రేపల్లెలోని ఏబీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూములను బాపట్ల జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భావన వశిష్ఠ సోమవారం పరిశీలించారు. ఆయా కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూముల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో రేపల్లె ఆర్డీఓ బి.శ్రీదేవి, తహసీల్దార్‌ ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement