శావల్యాపురం: మండలంలోని కృష్ణాపురం గ్రామ సమీపాన గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు మేరకు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు యువకులు కారులో అనంతరపురం నుంచి విజయవాడ బయలుదేరారు. నరసరావుపేట నుంచి వినుకొండ వైపు ట్రాలీ వాహనంలో ఇంటిసామానుతో బయలుదేరి వస్తున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి యువకులు ప్రయాణిస్తున్న వాహనం ఇంటి సామగ్రి ఉన్న వాహనాన్ని అతి వేగంతో ఢీకొట్టింది. ఘటనలో వాహన డ్రైవర్ సురేష్ కుడి చేతికి, ట్రాలీ వాహనంలో ఉన్న గుండాల వెంకయ్యలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఇరువురిని 108 అత్యవసర వాహనంలో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటన స్థలానికి ఎస్ఐ మోర్ల వెంకటేష్‌బాబు తన సిబ్బంది చేరుకొని రోడ్డుకు అడ్డుగా ఉన్న రెండు వాహనాలను గ్రామస్తులు సహకారంతో ట్రాక్టర్‌తో తప్పించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి.


