సత్తెనపల్లి: సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి గ్రామానికి చెందిన తాటికొండ బిక్షం (70) సోమవారం ఆర్టీసీ బస్సు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పట్టణ ఎస్‌ఐ పవన్‌కుమార్, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వృద్ధుడి మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా లేక వృద్ధుడి బిక్షం తప్పా అనేది పక్కన పెడితే .. నిత్యం రద్దీగా ఉండే సెంటర్‌లో రహదారిపైకి బస్సుషెల్టర్ ఏర్పాటు చేయడం, బస్సులు రోడ్డుపైనే నిలపడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అటు పాలకులు కానీ, ఇటు అధికారులు కానీ ఎలాంటి ముందుచూపు లేకుండా బస్సు షెల్టర్ నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధుడు బిక్షం మృతితో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వృద్ధుడు మృతి కారణంగా ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వృద్ధుడి కుటుంబానికి న్యాయం చేయాలని పలు వురు కోరుతున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి ప్రమాదాలు పునరావృతం కాకుండా బస్సు షెల్టర్‌ను పూర్తిగా వెనకవైపుకు తొలగింప చేయాలని ప్రజలు కోరుతున్నారు.


