మున్సిపల్‌ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

● ఎనిమిది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ ● 362 మంది నామినేషన్లకు ఆమోదం ● 21న నామినేషన్ల ఉపసంహరణలు

చీరాల: మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో రెండవ అంకం పూర్తయింది. చీరాల పట్టణంలోని 44 వార్డులకు గాను నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొత్తం 370 నామినేషన్లు అందాయి. సోమవారం ఉదయం 11గంటలకు నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా వార్డుల రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్ల పరిశీలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ఏఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సింది వివరించారు. అనంతరం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటల వరకు సాగింది. పట్టణంలోని మొత్తం 44 వార్డుల్లో నాలుగు వార్డులకు ఒక రిటర్నింగ్‌ అధికారి, ఇద్దరు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. నాలుగు వార్డులకు ఒక గదిని కేటాయించి నామినేషన్లను పరిశీలించారు. చైర్మన్‌ అభ్యర్ధికి ప్రత్యేక గదిని కేటాయించారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా అభ్యర్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతో మున్సిపల్‌ కార్యాలయం అభ్యర్థులతో నిండిపోయింది. ఆయా వార్డులకు కేటాయించిన గదుల వద్ద అభ్యర్థులు ఎదుట వారి నామినేషన్లును పరిశీలన చేయించుకున్నారు. ఏదైనా పొరపాట్ల వలన నామినేషన్‌ తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాన్ని అభ్యర్థికి వివరించారు. నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ కె.డానియేల్‌ జోసఫ్‌ పరిశీలన చేశారు. అనంతరం నామినేషన్లలో తిరస్కరణకు గురైన నామినేషన్ల వివరాలను నోటీస్‌బోర్డులు పొందుపరిచారు. వైఎస్సార్‌ సీపీ 128, టీడీపీ 105, కాంగ్రెస్‌ 84, జనసేన 15, ఇండిపెండెంట్‌ 29, బీజేపీ 6, సీపీఎం 1, ఇతరులు 2, చొప్పున దాఖలయ్యాయి. అలానే చైర్మన్‌ పదవికి మూడు నామినేషన్లు నమోదు కాగా అందులో వైఎస్సార్‌సీపీ 1, కాంగ్రెస్‌ 1, ఇండిపెండెంట్‌ 1 చొప్పున నమోదయ్యాయి. అలానే చైర్మన్‌ అభ్యర్ధికి మొత్తం 19 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌ సీపీ 6, టీడీపీ 3, బీఎస్‌పీ 1, కాంగ్రెస్‌ 3, ఇండిపెండెంట్‌లు 6 చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు.

చైర్మన్‌ అభ్యర్థులు మొత్తం 19 నామినేషన్లు దాఖలు చేయగా అన్నింటినీ ఆమోదించారు. వార్డు కౌన్సిలర్లకు మొత్తం 370 నామినేషన్లలో 362 మంది నామినేషన్లకు ఆమోదం తెలిపారు. వీటిలో ఎనిమిది మంది నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. వీటిలో కాంగ్రెస్‌ పార్టీ 2 , టీడీపీ 4, వైఎస్సార్‌సీపీ 2 చొప్పున తిరస్కరించారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుందన్నారు. ఎవరైనా అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరణ చేసుకునేవారు మధ్యాహ్నం 3 గంటలలోపు చేసుకోవాలని, అదేరోజు సాయంత్రం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement