ఓటర్లకు వసతుల కల్పనపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

ఓటర్లకు వసతుల కల్పనపై దృష్టి

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

చీరాల టౌన్‌: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు ఓటర్లకు పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్‌ వాసుదేవ వినోద్‌కుమార్‌ తెలిపారు. సోమవారం రాత్రి మండలంలోని కావూరివారిపాలెం గ్రామంలో పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించారు. చీరాల ఆర్డీవో ఎస్‌.నరసింహారావు, చీరాల మండల ఎన్నికల అధికారి, జిల్లా వ్యవసాయాధికారి ఎ.లక్ష్మితో కలిసి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రంలో విద్యుత్‌, దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులు, ఓటర్లకు, సిబ్బందికి మంచినీటి వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రాదేశిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అవాంతరాలు లేకుండా ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు, పోలింగ్‌ సిబ్బందికి వసతులు కల్పించాలన్నారు. మండలంలోని 24 ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానానికి బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియను సక్రమంగా పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశాల జారీ చేశారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ కె.గోపీకృష్ణ, ఎంపీడీవో కె.రఘుబాబు, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement