తెనాలి: ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పాత బజాజ్ షోరూం పక్కన ఉన్న ధూపం రాజేష్ అనే వ్యక్తి డ్రై ఫ్రూట్ షాప్‌లో లైన్ మోసానికి పాల్పడ్డాడు. మూడు రోజుల క్రితం ఆన్లైన్ నెట్వర్క్ రిపేర్ చేయడానికి వచ్చానని చెప్పి పక్కన స్థంభానికి ఉన్న నెట్ వర్క్ ను రిపేర్ చేసినట్టు నటించాడు. తిరిగి షాప్‌లోకి వచ్చి, ‘మీకు నెట్ వస్తుందా’ అని అడిగాడు. షాప్ యజమాని రావడం లేదు అని చెప్పగా, మీ ఫోన్లో సరిచేయాలని చెప్పి, రాజేష్ ఫోన్ తీసుకుని తన అకౌంట్ లో ఉన్న రూ.24 వేలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. తర్వాత తను మోసపోయానని తెలుసుకున్న రాజేష్, తన అకౌంట్‌ను నిలిపివేసి బ్యాంక్‌కు వవెళ్లి తెలుసుకోగా, హైదరాబాద్‌లోని చైతన్య గ్రామీణ బ్యాంక్‌లో ఒక మహిళ అకౌంట్లోకి వెళ్లినట్టు బ్యాంక్ అధికారులు నిర్ధారించారు. ఆ వివరాలు తీసుకుని టూ టౌన్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే, స్టేషన్లో కేసు నమోదు చేసుకోవడం లేదని బాధితుడు వాపోతున్నాడు. ‘నాది చిన్న అమౌంట్ కావచ్చు కానీ దొంగిలించిన వ్యక్తి ఇంకా ఎన్ని చేసి ఉంటాడో? నా అకౌంట్ లో పెద్ద మొత్తంలో అమౌంట్ ఉన్నట్టయితే, ఆ మొత్తం పోయి ఉండేది కదా’ అని బాధితుడు వాపోతున్నాడు.


