నేడు పీజీఆర్‌ఎస్‌ తాత్కాలికంగా రద్దు | - | Sakshi
Sakshi News home page

నేడు పీజీఆర్‌ఎస్‌ తాత్కాలికంగా రద్దు

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

బాపట్ల: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించడంతో జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సమస్యలతో అర్జీలు సమర్పించేందుకు ప్రజలు ఎవ్వరు కూడా రావద్దని జిల్లా కలెక్టర్‌ సూచించారు.

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి

వేమూరు: స్కూటీపై అతి వేగంగా వెళుతూ కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు... వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన షేక్‌ మున్నా, షేక్‌ ఖాజావలి స్కూటీపై వేమూరు నుంచి జంపని వెళుతున్నారు. జంపని షుగర్‌ ఫ్యాక్టరీ సమీపంలో సాయంత్రం 4 గంటలకు విద్యుత్‌ స్తంభాలను ఢీకొన్నారు. షేక్‌ మున్నా(30) అక్కడికక్కడే మృతి చెందాడు. షేక్‌ ఖాజావలికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనం ద్వారా తెనాలి ప్రభుత్వం వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. మృతి చెందిన షేక్‌ మున్నాకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు.

రెండు వాహనాలు ఢీ–ఒకరు మృతి

మేడికొండూరు: గుంటూరు–నరసరావుపేట ప్రధాన రహదారిపై పేరేచర్ల యూనివర్సల్‌ కాలేజీ సమీపంలో ఆదివారం ఉదయం రెండు టాటా మ్యాజిక్‌ వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ డ్రైవర్‌ మృతి చెందగా, మరో డ్రైవర్‌ గాయపడ్డాడు.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గుంటూరు నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న ఖాళీ టాటా మ్యాజిక్‌ వాహనం, నరసరావుపేట నుంచి గుంటూరు వైపు పత్తి లోడుతో వస్తున్న మరో టాటా మ్యాజిక్‌ వాహనం పేరేచర్ల సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పత్తి లోడ్‌ వాహనం డ్రైవర్‌ వర్ల కిరణ్‌బాబు (24) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. గుంటూరు నుంచి వస్తున్న ఖాళీ వాహనం డ్రైవర్‌ కూడా గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న మేడికొండూరు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement