వినుకొండ చైర్మన్‌ అభ్యర్థిగా పీఎస్‌ ఖాన్‌ నామినేషన్‌ దాఖలు | - | Sakshi
Sakshi News home page

వినుకొండ చైర్మన్‌ అభ్యర్థిగా పీఎస్‌ ఖాన్‌ నామినేషన్‌ దాఖలు

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

వినుకొండ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వినుకొండ మున్సిపాలిటీ చైర్మన్‌ అభ్యర్థిగా యువ నాయకుడు పి.ఎస్‌. ఖాన్‌ ఆదివారం తన నామినేషన్‌ దాఖలు చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన ఆయన నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బాసులింగారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎం. ఎన్‌. ప్రసాద్‌, పట్టణ కన్వీనర్‌ కొత్తమాసు శివ నాయకులతో కలిసి మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం రిటర్నింగ్‌ అధికారికి తమ నామినేషన్‌ పత్రాలను అధికారికంగా సమర్పించారు. నామినేషన్‌ అనంతరం చైర్మన్‌ అభ్యర్థి పిఎస్‌ ఖాన్‌ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును ఆదర్శంగా తీసుకొని తమదైన శైలిలో వినుకొండ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణ ప్రజలు తనను ఆదరించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనను చైర్మన్‌ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement