చీరాల: ‘అధికార పార్టీకి చెందిన నాయకురాలిని... శ్రీకాళహస్తి దేవస్థాన బోర్డు మెంబర్ని నన్నే లోపలికి వెళ్లనివ్వరా’ అంటూ శ్రీకాళహస్తి దేవస్థాన బోర్డు మెంబర్ కొమ్మనబోయిన రజని శనివారం మున్సిపల్ కార్యాలయం వద్ద హల్చల్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయానికి వంద మీటర్ల దూరంలో బారిగేడ్లు పెట్టి అభ్యర్థితోపాటు ఇద్దరిని మాత్రమే అనుమతించారు. పార్టీ నాయకులను మాత్రం లోపలికి అనుమతించలేదు. అదే సమయంలో అక్కడకు ద్విచక్రవాహనంపై పార్టీ జెండాతో లోపలికి అనుమతించాలనడంతో పోలీసులు అనుమతించలేదు. టూటౌన్ ఎస్సైతో వాదన అనంతరం లోపలికి అనుమతించారు. పార్టీ నాయకులను ఎవరిని అనుమతించని పోలీసులు అధికారం పార్టీ కావడంతో లోపలికి అనుమతించడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
పోలీసులతో వాగ్వాదానికి దిగిన శ్రీకాళహస్తి ఆలయ బోర్డు మెంబర్


