కోడ్‌ అమలులో ప్రభుత్వ యంత్రాంగం పచ్చపాతం | - | Sakshi
Sakshi News home page

కోడ్‌ అమలులో ప్రభుత్వ యంత్రాంగం పచ్చపాతం

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

కోడ్‌ అమలులో ప్రభుత్వ యంత్రాంగం పచ్చపాతం

జాతీయ నాయకుల విగ్రహాలకే ముసుగులు మీడియా కంట పడిన విషయం గ్రహించి హడావిడిగా దిద్దుబాటు చర్యలు

కొల్లూరు: ఎన్నికల కోడ్‌ అమలులో అధికారుల పచ్చపాత ధోరణి విమర్శలకు దారితీస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో అధికారులు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ఆయా పార్టీల సింబల్స్‌ కానరాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొల్లూరు మండలంలో మాత్రం ప్రభుత్వ యంత్రాంగ పచ్చపాత వైఖరి ప్రజలను విస్తుపోయేలా చేసింది. ఎన్నికల నియమావళిలో జాతీయ నాయకుల విగ్రహాలు, చిత్రపటాలకు కోడ్‌ వర్తింపులో మినహాయింపు ఉంది. మండలంలోని ఈపూరులంకలో ఇవేమి పట్టని పంచాయతీ యంత్రాంగం రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ విగ్రహాన్ని గోనె సంచులతో మూసి వేయడం వివాదాస్పదమైంది. అంబేడ్కర్‌ విగ్రహాన్ని మూసివేయడంపై ప్రశ్నించిన స్థానికులకు ఎన్నికల కోడ్‌ వల్ల విగ్రహాలకు ముసుగులు వేసినట్లు పంచాయతీ యంత్రాంగం చెప్పడంతో ముక్కున వేలేసుకోవడం ప్రజల వంతైంది. జాతీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేయడంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ప్రభుత్వ యంత్రాంగం మండల కేంద్రం కొల్లూరు 1, 2 సర్ణ సచివాలయ భవనంపై ఉన్న కూటమి నేతలు చిత్ర పఠాలకు కోడ్‌ వర్తింప జేసి మూసివేయకుండా ఉంచడం విమర్శలకు దారి తీసింది. కొల్లూరు స్వర్ణ సచివాలయ భవనంపై బహిరంగంగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, ఇతర ప్రజా ప్రతినిధుల చిత్ర పఠాలతో ఉన్న శిలాఫలకాన్ని మూసివేయకపోవడంపై ఇతర రాజకీయ పార్టీల నాయకులలో ఆగ్రహం వ్యక్తమయ్యింది. అయితే అంబేడ్కర్‌ విగ్రహంకు ముసుగులు వేయడం, స్వర్ణ కార్యాలయ భవనంపై కూటమి నేతల చిత్రపఠాలతో కూడిన శిలాఫలకాల వ్యవహారం మీడియా కంఠ పడిన విషయాన్ని గమనించిన అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. అంబేడ్కర్‌ విగ్రహానికి వేసిన ముసుగులను తొలగించడంతోపాటు, స్వర్ణ కార్యాలయ భవనంపై ఉన్న శిలాఫలకానికి శనివారం మధ్యహ్నం హడావిడిగా కాగితాలు అంటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement