ఈవీఎంల భద్రత పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఈవీఎంల భద్రత పరిశీలన

Oct 18 2026 2:12 AM | Updated on Oct 18 2026 2:12 AM

బాపట్ల: ఈవీఎంల భద్రత విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌ తెలిపారు. ప్రతి నెలా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా శనివారం బాపట్ల జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో భద్రపరిచిన ఈవీఎంల గోదామును ఆయన శనివారం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై ఆరా తీశారు. వెంట ఇన్‌చార్జీ డీఆర్‌వో లవన్న, ఆర్డీవో ఎ. హరికుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.హాసిని, ఎన్నికల విభాగ పర్యవేక్షకుడు షఫీ, తహసీల్దార్‌ సలీమా తదితరులు ఉన్నారు.

ప్రత్యేక మీడియా కేంద్రం ఏర్పాటు

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు అందిస్తామని జిల్లా కలెక్టర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో ప్రత్యేక మీడియా సమావేశ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రోజు ఉదయం 11 గంటలకు మీడియా ప్రతినిధులకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను తానే స్వయంగా తెలియజేస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement