రిజర్వేషన్లను పునఃపరిశీలించండి | - | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లను పునఃపరిశీలించండి

Oct 18 2026 2:12 AM | Updated on Oct 18 2026 2:12 AM

కలెక్టర్‌కు ఉప్పూడి మాజీ ఎంపీటీసీ వినతి సర్పంచ్‌, ఎంపీటీసీ స్థానాలూ ఎస్టీలకే కేటాయించడంపై అభ్యంతరం

రేపల్లె: రేపల్లె మండలం ఉప్పూడి గ్రామ పంచాయతీలో సర్పంచ్‌, ఎంపీటీసీ స్థానాలు రెండింటినీ ఎస్టీ కేటగిరీకి కేటాయించడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని జనరల్‌కుగాని, బీసీ, ఎస్సీ కేటగిరీలకు కేటాయించాలని కోరుతూ గ్రామస్తులు శనివారం రేపల్లె విచ్చేసిన జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో 59 మంది ఎస్టీ ఓటర్లు ఉండాల్సి ఉండగా ఓటర్ల వివరాల్లో 262 మంది ఉన్నట్లు నమోదైందని, దీంతో రిజర్వేషన్‌ కేటాయింపులో పొరపాటు జరిగి ఉండవచ్చని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్ల వివరాల్లో నమోదైన వ్యత్యాసాన్ని, రిజర్వేషన్ల కేటాయింపు విధానాన్ని సమగ్రంగా పరిశీలించి తగిన న్యాయం చేయాలని కోరారు. రేపల్లె ఆర్డీవో బూసి శ్రీదేవికి సమస్యపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అల్లంశెట్టి సతీష్‌బాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement