నగరంపాలెం: జిల్లాలోని పోలీస్ అధికార, సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలనతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని పోలీస్ సిబ్బంది నుంచి వ్యక్తిగత, బదిలీలు, ఉద్యోగోన్నతులు, సెలవులు, వైద్య అవసరాలు, ఇతర పరిపాలనా అంశాలపై జిల్లా ఎస్పీ వినతులు స్వీకరించారు. ప్రతి వినతిని స్వయంగా పరిశీలించారు. అర్జీలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమస్యలు సకాలంలో పరిష్కారమైతే విధి నిర్వహణలో సామర్థ్యం, నిబద్ధత, ఉత్సాహం పెరుగుతుందని చెప్పారు.


