ప్రజా నిరసన కేంద్రంగా జంతర్‌ మంతర్‌ను కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా నిరసన కేంద్రంగా జంతర్‌ మంతర్‌ను కొనసాగించాలి

Oct 17 2026 3:09 AM | Updated on Oct 17 2026 3:09 AM

ప్రజా నిరసన కేంద్రంగా జంతర్‌ మంతర్‌ను కొనసాగించాలి

లక్ష్మీపురం: ప్రతి ఓటరు హక్కును కాపాడాలని, ప్రత్యేక సమగ్ర సమీక్ష (’సర్‌’) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని శాసనమండలి మాజీ సభ్యులు కె.ఎస్‌.లక్ష్మణరావు కోరారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, జన విజ్ఞాన వేదిక, అవగాహన, మధ్యతరగతి ఫోరం, ఆల్‌ ఇండియా అభ్యుదయ ఫోరం ఆధ్వర్యంలో స్థానిక లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జాషువా విజ్ఞాన కేంద్రం ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వి.వి.కే.సురేష్‌ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం క్యాండిల్‌ ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే పెద్ద ఎత్తున కోట్లాది మంది ఓట్లను తొలగించడం దుర్మార్గమని, బెంగాల్‌ మరియు బిహార్‌ వంటి రాష్ట్రాల్లో ’సర్‌’ అత్యంత హడావిడిగా అమలు చేశారని దాని ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడిందని పేర్కొన్నారు. ఫారం– 6లో ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా మార్పులు చేయడాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టిందని అన్నారు. ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలకు పూర్తి బాధ్యత వహించి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరును తొలగిస్తూ చట్ట సవరణ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతమని, ఎన్నికల సంఘం స్వతంత్రత, నిష్పాక్షికతతలను దెబ్బ తీశారని అన్నారు. ప్రజా ఉద్యమాల అణచివేత, ప్రజా ప్రతినిధులపై అమానుషమైన దాడి, అక్రమ కేసులు, యువత మరియు విద్యార్థుల పోరాటంపై దాడి ప్రభుత్వ అసహనాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జన చైతన్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌ వి.లక్ష్మణరెడ్డి, యూటీఎఫ్‌ సీనియర్‌ నేత ఎం.హనుమంతరావు, వివిధ సంస్థల తరపున వి.రాధాకృష్ణమూర్తి, వి.సదాశివరావు, ఎన్‌.భావన్నారాయణ, జాన్‌ బాబు, విశ్రాంత ఇంజినీర్‌ జి.వెంకట్రావు, అబ్దుల్‌ సలీమ్‌, ఎం.ఎ.చిష్టి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement