చీరాల టౌన్: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎన్నికల నియమావళి ఆమల్లోకి వచ్చి 48 గంటలు కావస్తున్నా కానీ ఈపురుపాలెం మేజర్ గ్రామ పంచాయతీలో మాత్రం ఈసీ నిబంధనలు అమల్లోకి రాలేదు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే తప్పకుండా రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయడంతో పాటు రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు సైతం తొలగించాలి. కానీ ఈపురుపాలెం గ్రామంలోని సెంటర్ బస్టాండ్ వద్ద టీడీపీ నాయకులు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కోడ్ అమల్లో ఉన్నప్పుడు తొలగించాల్సిన పంచాయతీ అధికారులు మాత్రం టీడీపీ ఫ్లెక్సీని తొలగించడం లేదు. ఈ ఫ్లెక్సీలో సీఎం, కలెక్టర్, జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులతో కూడిన పెద్ద ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీని తొలగించలేదు. ఈపురుపాలెంలో ఈసీ నిబంధనలు పాటించలేని స్థితిలో అధికారులు ఉన్నారా.. అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చీరాల–బాపట్ల ప్రధాన రహదారిలో ఉన్న ఈ ఫ్లెక్సీ అధికారులకు కనిపించలేదా? వేచి చూడాలి.
అధికార పార్టీ ఫ్లెక్సీ తీసివేయకుండా కాలయాపన


