మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా డాక్టర్‌ ఇస్తర్ల షెర్లి | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా డాక్టర్‌ ఇస్తర్ల షెర్లి

Oct 16 2026 7:41 AM | Updated on Oct 16 2026 7:41 AM

ఎన్‌క్వాస్‌ సేవల్లో ద్వితీయ స్థానంలో గుంటూరు

వైఎస్సార్‌ సీపీ అధిష్టానం ప్రకటన

చీరాల: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా డాక్టర్‌ ఇస్తర్ల షెర్లిని పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదల కాగా నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌బాబు గురువారం వెల్లడించారు. చీరాలకు చెందిన గుండె వైద్య నిపుణులు డాక్టర్‌ ఇస్తర్ల బాబూరావు కుమార్తె డాక్టర్‌ ఇస్తర్ల షెర్లి ఎంబీబీఎస్‌ పూర్తి చేసి పల్మనాలజీలో పీజీ కోర్సును చదువుతున్నారు. ఎస్సీ సామాజికవర్గంలో డాక్టర్‌ ఇస్తర్ల బాబూరావుకు మంచి పేరుంది. అలానే ఆయన ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులు, వైఎస్సార్‌ సీపీ డాక్టర్‌ విభాగం చీరాల కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. పార్టీ చైర్మన్‌ అభ్యర్థిని ఖరారు చేయడంతో పార్టీ క్యాడెర్‌ ఆమె గెలుపునకు కృషి చేస్తుందని వైఎస్సార్‌ సీపీ నాయకులు తెలిపారు.

వైఎస్సార్‌ సీపీ నాయకులకు బెదిరింపులు

చీరాల: మున్సిపాలిటీ ఎన్నికల కోడ్‌ కూయగానే పోలీసుల నుంచి వేధింపుల పర్వం ప్రారంభమైంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు, వారి వెంట తిరిగే యువకుల పేర్లు ఇవ్వాలంటూ ఏకంగా చీరాల ఒన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి ఎస్సై ఒకరు ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా ఎన్నికల్లో అభ్యర్థుల వెంట ఎవరూ ప్రచారాలకు తిరగకుండా ఉండేందుకు బైండవర్ల పేరుతో బెదిరింపులకు దిగుతున్నారు. మా వార్డులో నేరప్రవృత్తి ఉన్నవారు ఎవరూ లేరని చెప్పినా పై నుంచి ఆదేశాలంటూ పేర్లు ఇవ్వాలని పార్టీ నాయకులకు ఫోన్లు చేస్తున్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని అందరూ కోరుకుంటున్న సమయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు, నాయకులకు పోలీసుల నుంచి ఫోన్లు రావడం విస్మయానికి గురిచేస్తోంది.

రైట్‌ గేర్‌ ఎక్విప్‌మెంట్‌పై సమీక్ష

నరసరావుపేట రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అవసరమైన సందర్భాల్లో వినియోగించాల్సిన రైట్‌ గేర్‌ ఎక్విప్‌మెంట్‌పై సమీక్షను గురువారం నిర్వహించారు. అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ సంఘటనల నివారణ, పోలీసు సిబ్బంది సంసిద్ధత, ప్రజలకు భద్రత కల్పించే చర్యల్లో భాగంగా సంబంధిత పరికరాల వినియోగంపై సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఉన్నతాధికారుల ఆదేశాలు, నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని తెలిపారు. ఆర్‌ఐలు కృష్ణ, గోపినాథ్‌, ఏఆర్‌ సిబ్బందిలు పాల్గొన్నారు.

ఆలయంలో హుండీల చోరీ

చిలకలూరిపేట టౌన్‌: పట్టణంలోని ఎన్టీఆర్‌ కాలనీ ఫస్ట్‌లైన్‌లో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలు పగలగొట్టి రెండు హుండీలను లక్ష్యంగా చేసుకోగా.. ఒక హుండీని ధ్వంసం చేసి నగదు అపహరించారు. మరో హుండీని ఎత్తుకెళ్లారు. ఆలయ పరిసరాల్లో రాత్రివేళ కొందరు మద్యం, గంజాయి సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి ఎదురుగా ఉన్న సీసీ కెమెరాను రెండు వారాల కిందటే ధ్వంసం చేశారని, మద్యం సేవిస్తున్న వారిని ప్రశ్నించిన వాచ్‌ మెన్‌ను రెండు రోజుల కిందట బెదిరించారని చెబుతున్నారు. ఈ ఘటనల వెనుక సంబంధం ఉందాఅనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విచారణ జరిపి నిందితులను గుర్తించాలని, రాత్రివేళ గస్తీ పెంచి ఆలయానికి రక్షణ కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

గుంటూరు మెడికల్‌: ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు అందించే వైద్య సేవల్లో గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వితీయ స్థానంలో నిలిచింది. నేషనల్‌ క్వాలిటీ ఎస్సూరెన్స్‌ స్కీమ్‌ (ఎన్‌ క్వాస్‌) గురువారం విడుదల చేసిన రాష్ట్ర స్థాయి నివేదికలో తొలిస్థానం ఈస్ట్‌ గోదావరి జిల్లా దక్కించుకోగా, గుంటూరు ద్వితీయ స్థానం, వైఎస్సార్‌ కపడ జిల్లా తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. ఆరోగ్య కేంద్రాలకు చికిత్స కోసం వచ్చే రోగులు ఓపీ చీటి తీసుకున్న దగ్గర్నుంచి, మందులు, ల్యాబ్‌ పరీక్షలు, లోపల ఆరోగ్య కేంద్రాల్లో ఉండే వసతులు, రోగికి అందించే వైద్య సేవలు, ఆసుపత్రిలో వాతావరణం తదితర అంశాలపై ఎన్‌క్వాస్‌ సర్వేను అన్ని జిల్లాల్లో నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement