అంతర జిల్లాల కబడ్డీ పోటీలకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

అంతర జిల్లాల కబడ్డీ పోటీలకు సిద్ధం

Oct 16 2026 7:41 AM | Updated on Oct 16 2026 7:41 AM

చినగంజాం: అంతర జిల్లాల జూనియర్‌ కబడ్డీ పోటీలకు పురుషుల జట్టు సిద్ధమైంది. ఈ నెల 16,17,18 తేదీల్లో మార్కాపురంలో నిర్వహించే 52వ అంతర జిల్లాల జూనియర్‌ కబడ్డీ జట్టు క్రీడాకారులను చక్కటి శిక్షణ అందించడం ద్వారా పోటీలకు సిద్ధం చేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్తపాలెం పంచాయతీ శ్రీ బాలకోటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. సమయంలో మంచి ప్రతిభ కనబరచిన 14 మంది క్రీడాకారులను పోటీలకు ఎంపిక చేశారు.

జట్టు వివరాలు..

ఎం.మణికంఠారెడ్డి, ఎస్‌.వెంకట శివగణేష్‌, ఎం.రత్నారెడ్డి, ఏ.అభిలాష్‌రెడ్డి, కె.సంజీవరెడ్డి, బి.దుర్గాశంకరరెడ్డి, ఏ.అశోక్‌రెడ్డి, కె.సంతోష్‌కుమార్‌, వైఎల్‌ఎన్‌ స్వామి, ఎస్‌.హేమంత్‌, బి.శ్రీసాయి, ఎస్‌కే జుబేల్‌, బి.భవానీశంకరరెడ్డి, ఏ.రాజు, కోచ్‌గా కోట హరిప్రసాద్‌రెడ్డి, మేనేజర్‌గా సైకం నాగూర్‌ వ్యవహరిస్తున్నారు.

క్రీడా దుస్తులు అందించిన దాతలు

క్రీడా దుస్తులను భువనగిరి జిల్లా యాదాద్రిలోని రామన్నపేటకు చెందిన ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ కొట్టే ఏడుకొండలు (ది మిషన్‌ ఫౌండర్‌ )సమకూర్చడంతో బాలకోటేశ్వర స్వామి ఎంప్లాయీస్‌ యూనియన్‌ సభ్యులు మరపాల ఏడుకొండలురెడ్డి, కోట శ్రీనివాసరెడ్డి, రాజు రామకోటిరెడ్డి అందజేశారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా కబడ్డీ కార్యదర్శి మంతెన సుబ్బరాజు, ఉపాధ్యక్షుడు సాంబశివరావు, సీనియర్‌ క్రీడాకారులు ఆమంచి శ్రీనివాసరావు, పోలీస్‌స్టేషన్‌ రైటర్‌ ప్రకాష్‌, ఆలయ కమిటీ ట్రెజరర్‌ రాజు రామకోటిరెడ్డి, కమిటీ సభ్యులు అక్కల సాంబశివారెడ్డి, బక్కా సుబ్బారెడ్డి, సీనియర్‌ క్రీడాకారులు మూలగాని శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement