నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం వశిష్ట జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో పల్నాడు జిల్లా సీనియర్ బాలురు, బాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు పోటీలు నిర్వహించి జిల్లా జట్లు ఎంపిక చేసినట్టు అసోసియేషన్ కార్యదర్శి కొత్త తేజాకరణ్, కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్‌కుమార్, ప్రిన్సిపల్ సూదా సురేష్‌బాబు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు విజయవాడలో జరగనున్న 73వ రాష్ట్రస్థాయి సీనియర్ బాల బాలికల కబడ్డీ చాంపియన్‌షిప్– 2026 పోటీలో పల్నాడుజిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.


