జిల్లా అభివృద్ధికి తోడ్పడేలా ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

జిల్లా అభివృద్ధికి తోడ్పడేలా ప్రణాళిక

Oct 15 2026 8:48 AM | Updated on Oct 15 2026 8:48 AM

బాపట్ల: జిల్లాలోని వివిధ రంగాల అభివృద్ధికి, ప్రజల ఆర్థిక పురోగతికి తోడ్పడేలా రూ.15,765 కోట్ల రుణ లక్ష్యంతో రూపొందించిన బాపట్ల జిల్లా వార్షిక క్రెడిట్‌ ప్రణాళిక పుస్తకాన్ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, విద్య, గృహ నిర్మాణం, స్వయం ఉపాధి తదితర రంగాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించడమే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. రైతులకు పంట రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణ, పశుసంవర్ధక, మత్స్య రంగాల అభివృద్ధితో పాటు చిన్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, నిరుద్యోగ యువతకు రుణ సదుపాయాలు కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రణాళిక దోహదపడుతుందని అన్నారు. బ్యాంకర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌డీఎం శివకృష్ణ, వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి ఖలీం, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్‌ సుమతి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement