వార్డుల విభజనలో శాసీ్త్రయతలేదు | - | Sakshi
Sakshi News home page

వార్డుల విభజనలో శాసీ్త్రయతలేదు

Oct 15 2026 8:48 AM | Updated on Oct 15 2026 8:48 AM

వార్డుల విభజనలో శాసీ్త్రయతలేదు

బాపట్ల: బాపట్ల మున్సిపాల్టీలో వార్డుల విభజనలో శాసీ్త్రయతలేదని మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి పేర్కొన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కోన రఘుపతి మాట్లాడారు. బాపట్ల కేంద్రంగా జిల్లాను సాధించుకోవటంతోపాటు గ్రామీణ ప్రాంతాలను కలపటం వలన స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాల్టీగా మారేందుకు అవకాశాలను వైఎస్సార్‌సీపీ కల్పించిందన్నారు. ఈమేరకు జనాభా సంఖ్య పెరగటంతో నిధులు కూడా వచ్చే అవకాశాలు తీసుకువచ్చామని కోన చెప్పారు. ఈమేరకు 1.07 లక్షల మంది బాపట్ల జనాభాగా చూపించి అమృత పథకం నుంచి రూ.24 కోట్లు తీసుకున్న పాలవర్గం ఇప్పుడు లక్షలోపు జనాభాకు విభజించే 44 వార్డులకే పరిమితం కావటం ఆశ్చర్యంగా ఉందన్నారు. లక్షజనాభాకు మించి ఉంటే 48వార్డులు వచ్చేఅవకాశం ఉండగా వాటిని జారవిడుచుకోవటం సరికాదన్నారు. వార్డుల జనాభా విభజన కూడా సక్రమంగా ఉంటుందని ఆయన తెలిపారు.వార్డుల విభజనలో డోర్‌నెంబరు,వీధిపేర్లు ఉదహరించకుండా సర్వే నెంబర్లుతో ఏవిధంగా వార్డులను విభజిస్తారని ఆయన ప్రశ్నించారు.ఆశాసీ్త్రయంగా విభజించిన వార్డుల వలన లీగల సమస్యలను తెచ్చుకునేందుకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.ఎన్నికల నిబంధనలను కూడా తుంగలో తొక్కేవిధంగా వార్డుల విభజన ఉందని కోన పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ,మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, పార్టీ నాయకులు ఇనగలూరి మాల్యాద్రి, నక్కా వీరారెడ్డి,కొక్కిలిగడ్డ చెంచయ్య,చల్లా రామయ్య, నర్రావుల వెంకట్రావు, గంగిశెట్టి రత్తయ్య,చెరుకూరి కిరణ్‌,జోగి రాజా తదితరులు ఉన్నారు.

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement