‘చలో ఢిల్లీ‘ జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

‘చలో ఢిల్లీ‘ జయప్రదం చేయండి

Oct 14 2026 4:29 AM | Updated on Oct 14 2026 4:29 AM

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు

లక్ష్మీపురం: కార్మికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలని, కార్మికవర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను పటిష్టంగా అమ లు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వ ర్యాన డిసెంబరు 1,2,3 తేదీలలో జరిగే ‘ఛలో ఢిల్లీ‘ కార్యక్రమంలో కార్మికులు పాల్గొని జయ ప్రదం చేయాలని యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం పాత గుంటూరు సీఐటీయూ కార్యాలయంలో నగర విస్తృత సమావేశం కె.శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లేబర్‌ కోడ్స్‌ అమలులోకి వస్తే కార్మికవర్గం రోడ్డున పడే ప్రమా దం ఉందని అన్నారు. రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాలు 15 ఏళ్లుగా పెంచలేదని, రెండవ వైపు ధరలు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో సీఐటీయూ నగర కన్వీనర్‌ బి.ముత్యాలరావు, నాయకులు కె.నళినీకాంత్‌, బి.సత్యనారాయణ, షేక్‌ మస్తాన్‌ వలీ, ప్రమీల, షేక్‌ ఖాసింవలి, షేక్‌ బాషా, పూనేపల్లి శ్రీనివాసరావు, వై.ప్రభుదాసు, జె.జశ్వంత్‌, జి.మరియదాసు, రమేష్‌బాబు, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement