రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ప్రాణాలు విడిచిన వృద్ధుడు | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ప్రాణాలు విడిచిన వృద్ధుడు

Oct 14 2026 4:29 AM | Updated on Oct 14 2026 4:29 AM

పర్చూరు(చినగంజాం): రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పని నిమిత్తం వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో ఓ వృద్ధుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ అంకమ్మరావు అందించిన సమాచారం మేరకు.. చీరాల బాలాజీ టవర్స్‌లో నివాసం ఉంటున్న రామలింగం రాధాకృష్ణారెడ్డి(85) పర్చూరు రిజిష్ట్రార్‌ కార్యాలయం వద్దకు మంగళవారం తన్నీరు లక్ష్మి అనే మహిళతో కలిసి వచ్చాడు. కార్యాలయంలో పనులు ముగించుకొని తిరిగి బయటకు వెళుతుండగా కార్యాలయం ముఖ ద్వారం వద్ద ఒక్క సారిగా కుప్పకూలిపోయాడు. అకస్మాత్తుగా వృద్ధుడు నేలపై పడిపోవడంతో కార్యాలయంలో ఆవరణలో ఉన్న వారంతా ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారించి మహిళను అడిగి వివరాలు తీసుకున్నారు. 108 వాహన సిబ్బంది గుండెపోటుతో మృతి చెందినట్లు గుర్తించారు. గ్రామ రెవెన్యూ అధికారి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement