న్యూస్‌రీల్
చీరాలలో త్రిముఖ పోటీ
రిజర్వేషన్ల ఖరారుతో దూకుడు పెంచిన పార్టీలు చీరాల మున్సిపాలిటీలో పోటీ తీవ్రం వార్డులలో పర్యటిస్తున్న నాయకులు గెలుపే ధ్యేయంగా దూసుకెళుతున్న వైఎస్సార్ సీపీ
బాపట్ల
బుధవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇందుకు నాందిగా మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉండటంతో రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తు ప్రారంభించాయి. పురపోరుకు రాజకీయ పార్టీలు సై అంటే సై అంటూ దూకుడు పెంచేశాయి. సార్వత్రిక ఎన్నికలు జరిగిన రెండున్నరేళ్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలు తమ బలాబలాలు ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అమలు కాని హామీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు తీసుకొస్తోంది. రెండున్నరేళ్ల పాలనే అజెండాగా కూటమి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.
7
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.9183 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మకు ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయం తరఫున మంగళవారం సారె సమర్పించారు.
చందోలు(బాపట్ల): చందోలు గ్రామంలో వేంచేసియున్న బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం అన్నపూర్ణాదేవిగా బగళాముఖి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన ఉభయ దాతలుగా చెరుకుపల్లికి చెందిన తాతా శివశంకరరావు దంపతులు వ్యవహరించారు. భక్తులకు అన్నదానం, రాత్రి ప్రసాదాలు, అల్పాహార వితరణ ఏర్పాటు చేశామని దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్‌రెడ్డి, ఈవో ఇ.నరసింహ మూర్తి తెలిపారు.
క్రోసూరు: శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని క్రోసూరులోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు ధనలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం అమ్మవారిని రూ.కోటి విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ, కూటమి పార్టీల మధ్య పోటీ నడుస్తోంది. అయితే చీరాలలో మాత్రం అందుకు భిన్నంగా త్రిముఖ పోటీ నెలకొంది. వైఎస్సార్ సీపీ, కూటమి పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పురపోరుకు సిద్ధమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్‌బాబు ఎన్నికల సన్నాహ కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణంలోని 44 వార్డుల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. అలానే ప్రతిరోజు వార్డుల్లోని నాయకులను కలిసి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ చీరాల మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడిచేందుకు వైఎస్సార్ సీపీని బలపరచాలని సమావేశాలు నిర్వహించి పార్టీ క్యాడర్‌ను సంసిద్ధం చేస్తూ దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వార్డులలో పర్యటిస్తున్నారు.
చీరాల: చీరాల పురపోరు ఈసారి రసవత్తరంగా సాగనుంది. చీరాల మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ కోటాను ప్రభుత్వం ఎస్సీ మహిళకు ఖరారు చేసింది. బీసీ జనరల్, బీసీ మహిళ రిజర్వేషన్ కోటా కింద చైర్మన్ పదవి దక్కుతుందని ఆశించినా చీరాల మున్సిపాలిటీలో ఎస్సీ సామాజికవర్గం నుంచి మహిళకు చైర్మన్ రిజర్వేషన్ ఖరారు చేయడం రాజకీయ పార్టీలను ఆశ్చర్యానికి గురిచేసింది. సమీకరణాలు మారడంతో నేతలు దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. మున్సిపాలిటీ చరిత్రలోనే తొలిసారిగా చైర్మన్ రిజర్వేషన్ ఎస్సీ మహిళకు కేటాయించారు. రిజర్వేషన్ ఊహించని విధంగా వచ్చినా అందుకు తగ్గట్టుగా రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.
మహిళా ఓటర్లే కీలకం
చీరాల మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజనలో భాగంగా గతంలో 33 వార్డులు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 44కు పెంచారు. అలానే పోలింగ్ కేంద్రాల సంఖ్య 67 నుంచి 88కి పెరిగింది. మొత్తం ఓటర్లు 69,557 మంది. వీరిలో పురుషులు 33,504, మహిళలు 36,043, ఇతరులు 10 మంది ఉన్నారు. ఎస్సీలు 15,604, ఎస్టీలు 3,838, బీసీలు 27,948, ఓసీలు 22,167 మంది ఓటర్లు ఉన్నారు. అన్ని వర్గాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పీఠం అన్‌రిజర్వ్ అయింది. ఈ సారి ఎన్నికలో చైర్మన్ రిజర్వేషన్ ఎస్సీ మహిళకు కేటాయించడంతో రెండు పర్యాయాల తర్వాత మళ్లీ చైర్మన్ పీఠం మహిళలకు దక్కనుంది.
ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక
మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్‌ను ఎక్కువ సీట్లు గెలిచిన రాజకీయ పార్టీ కౌన్సిలర్లు ఎన్నుకునేవారు. చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు క్యాంపు రాజకీయాలు నడిచేవి. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతిలో చైర్మన్‌ను ప్రజలే ఎన్నుకుంటారు. ఎన్నికల్లో ప్రజలు వార్డు కౌన్సిలర్‌కు ఒక ఓటు, చైర్మన్ అభ్యర్థికి ఒక ఓటు వేయనున్నారు. కౌన్సిలర్ల మెజార్టీతో పనిలేకుండా నేరుగా ప్రజలే ఎన్నుకుంటారు. దీంతో ఈసారి ఎన్నిక ‘భారీ’గానే ఉంటుందని అంచనా.
కూటమిలో పదవి ఎవరికో?
చైర్మన్ పదవి బీసీ, ఓసీ రిజర్వ్ అవుతుందని ఆశించినా ఎవరూ ఊహించని విధంగా తొలిసారి ఎస్సీ మహిళకు రిజర్వేషన్ ఖరారు కావడంతో కూటమి పార్టీలో ఎవరిని బరిలో నిలపాలనేది ఇప్పటి వరకు ఖరారు కాలేదు. కూటమి పార్టీల్లో దాదాపు అన్ని ప్రధాన పదవులు టీడీపీకే దక్కాయి. మున్సిపల్ కౌన్సిల్ పదవీ కాలం ముగుస్తున్న సమయంలో గత ఏడాది మారిన రాజకీయంలో అనూహ్యంగా చైర్మన్ పదవి టీడీపీకి దక్కింది. అలానే ఏఎంసీ చైర్మన్ పదవి కూడా టీడీపీదే. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులు ద్వితీయ శ్రేణి పదవులకే పరిమితమయ్యారు. ప్రస్తుతం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించాలని ఆశావహులు పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నిక కావడంతో చైర్మన్ ఎన్నిక ‘భారీ’గా జరగనుంది. ఆ స్థాయి సామర్థ్యం ఉన్న వారిని ఎంపిక చేయడం కత్తిమీద సాము లాంటిది. అయితే చైర్పర్సన్ పదవి కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీలో దేనికి దక్కుతుందనేది వేచి చూడాల్సిందే. ప్రజా వ్యతిరేకతను దాటి విజయం సాధించాలని అధికారపార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.


