అన్నపూర్ణాదేవిగా బాల చాముండేశ్వరి | - | Sakshi
Sakshi News home page

అన్నపూర్ణాదేవిగా బాల చాముండేశ్వరి

Oct 14 2026 3:53 AM | Updated on Oct 14 2026 3:53 AM

అన్నపూర్ణాదేవిగా బాల చాముండేశ్వరి

అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న బాల చాముండికా సమేత అమరేశ్వర ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మంగళవారం బాల చాముండేశ్వరి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, దేవీఖడ్గమాల, లలిత సహస్ర నామార్చన, శ్రీచక్రార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మాట్లాడుతూ అన్నపూర్ణాదేవి అలంకార విశిష్టతను వివరించారు. జ్వాలాముఖి, మహిషాసురమర్ధని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement