నీ జీవితం విలువైనది..! | - | Sakshi
Sakshi News home page

నీ జీవితం విలువైనది..!

Oct 13 2026 1:41 AM | Updated on Oct 13 2026 1:41 AM

● గత ఏడాది వేటపాలెం పాకనాటి వీధిలో 36 ఏళ్ల వ్యక్తి భార్య మరణించగా ఒక్కడే ఉంటున్నాడు. భార్య మరణాన్ని తట్టు కోలేక ఆరు నెలలకే ఇంట్లో ఫ్యాన్‌కి ఉరేసుకొని మృతి చెందాడు. ● కొత్తపాలెంకి చెందిన 32 ఏళ్ల యువకుడు 2025 డిసెంబర్‌లో ఆర్థిక ఇబ్బందుతో ఇంటి నుంచి వెళ్లివిపోయాడు. ఇంటి నుంచి వెళ్లిన మరుసటి రోజు తెల్లవారు జామున ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరేసుకొని బలవర్మణానికి పాల్పడ్డాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ● డిసెంబరులో దేశాయిపేట పంచాయతీ నీలకంఠాపురంకి చెందిన 25 ఏళ్ల యువకుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండేవాడు. ఇతనికి పెళ్లి అయింది. పెళ్లి అయిన రెండేళ్లకే భార్య పుట్టింటికి వెళ్లింది. దీనితో మానసింగా కుంగిపోయాడు. రాత్రి ఇంట్లో నిద్రపొయిన యువకుడు తెల్లవారి లేచి చూచేసరికి ఇంట్లో ఫ్యాన్‌కి ఉరేసుకొని మృతి చెంది ఉన్నాడు. ● గత ఏడాది నవంబర్‌ నెలలో ఆణుమల్లిపేటకు చెందిన 36 ఎళ్ల వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో కుంగిపోయి రైలు కింద పడి బలవర్మణానికి పాల్పడ్డాడు. ఇది జరిగిన రెండు రోజులకే ఇతని తాలూకు 30 ఏళ్ల మహిళ రామన్నపేట దగ్గరలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

మానసిక కుంగుబాటు లక్షణాలు

ఒంటరితనాన్ని కోరుకుంటారు.

మగవారు అతిగా మద్యం తాగుతారు.

ప్రతీకారం తీర్చుకోవడం పైనే ఎక్కవగా మాట్లాడుతుంటారు

తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవడం

అతిగా నిద్రపోవడం

రాత్రిపూట నిద్రపోకుండా ఎక్కువగా ఆలోచిండం.

అసలు దేనికి స్పందించకపోవడం, చనిపోతున్నట్లు ముందుగానే పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం లాంటివి చేస్తుంటారు.

ఇలా చేయాలి..

క్షణికావేశంతో బలవన్మరణాలు

చిన్నచిన్న సమస్యలకే

అతిగా కుంగుబాటు

ప్రాణాలు తీస్తున్న క్రికెట్‌ బెట్టింగులు

రెండేళ్లలో 20 మంది బలవర్మణాలు

బలవన్మరణాలతో కుటుంబాలు చిన్నాభిన్నం

వేటపాలెం: ఆధునిక సాంకేతిక యుగంలో యువత తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని జయించలేక చిన్నచిన్నవాటికి కుంగిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. అంతేకాదు క్రికెట్‌ బెట్టింగులకు బానిసై అప్పులపాలై అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. ఫలితంగా ఎన్నో కలలు కన్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలిస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగి.. బెట్టింగ్‌కు బానిసై..

దేశాయిపేట పంచాయతీ రామనగర్‌కి చెందిన లేళ్ల వీరన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూ.. ఎస్పీ గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తుంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఇతని చిన్నతనం నుంచి క్రికెట్‌ అంటే మక్కువ ఉండటంతో క్రికెట్‌ బెట్టింగులు పెట్టెవాడు. ఈ బెట్టింగుల కారణంగా అధిక మొత్తంలో అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చడం కష్టంగా మారింది. దీనితో మనశ్శాంతి కోల్పోయి క్షణికావేశంలో ఈ నెల 11వ తేదీన చెట్టుకు ఉరేసుకొని బలవర్మణానికి పాల్పడ్డాడు. తాను తీసుకున్న నిర్ణయంతో ఇతనిపై ఆధార పడిన భార్య, ఇద్దరు ఆడపిల్లలు కుటుంబ పెద్దను కోల్పోయారు.

భార్యాభర్తల బలవన్మరణం..

ఏప్రిల్‌ 29వ తేదీన రావూరిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మాజేటి ప్రభాకర్‌ క్రికెట్‌ బెట్టింగులకు బానిసయ్యాడు. బెట్టింగుల కారణంగా రూ.లక్షల్లో అప్పులు చేశాడు. తీసుకున్న బాకీలు తిరిగి చెల్లించలేక బంధువులకు తెలిస్తే పరువు పోతుందని భావించి ఇంట్లో ఉరేసుకొని మృతి చెందాడు. భర్త ఉరేసుకున్న ఘటన చూసిన భార్య పార్వతి కూడా ఐదేళ్ల తరువాత పుట్టిన 13 నెలల చిన్నపాప ఉందని కూడా మర్చిపోయి క్షణికావేశంలో ఇంట్లోనే ఆమె కూడా ఉరేసుకొని తనువు చాలించింది. దీంతో వారి 13 నెలల చిన్నారి తల్లిదండులు లేని బిడ్డగా మిగిలిపోయింది.

ఇటీవల జరిగిన పలు ఘటనలు..

కారణాలెన్నో..

ప్రాణం విలువైందని గ్రహించేలోపు క్షణికావేశంలో కొందరు యువకులు బలవర్మణాలకు పాల్పడుతున్నారు. 2024 నుంచి 2026 రెండేళ్లలో దాదాపు 20 మంది తనువు చాలించారు. కుటుంబ సమస్యలనో, ఆర్థిక ఇబ్బందులనో, చేసిన అప్పుల బాధ తాళ లేకనో, అనారోగ్యమనో, పరీక్షల్లో తప్పామనో, ప్రేమ విఫలమైందనో ఇలా రకరకాల కారణాలతో అతిగా ఆలోచించి బలవతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

ఆత్మహత్యకు పాల్పడేవారిని ముందే గుర్తించవచ్చని మానసిక నిపుణలు చెప్తున్నారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారు కొన్ని అసాధారణ లక్షణాలను కలిగి ఉంటారు.

ఆత్మహత్య భావనలో ఉన్న వారిని ఒంటరిగా ఉంచరాదు. వీలైనంత వరకు ఇంట్లో వారందరి మధ్య ఉంచి కుటుంబ సభ్యులంతా వారిలో ధైర్యం నింపాలి. వీలైనంత వరకు ఆత్మహత్య భావన ఉన్నవారిని ఆత్మహత్యకు సహకరించే వస్తువులను ఆందుబాటులో లేకుండా చూడాలి. ఆత్మవిశ్వాసం, పాజిటివ్‌ థింక్‌ పుస్తకాలు, బిహేవియర్‌ థెరఫీ, కౌన్సెలింగ్‌ ప్రక్రియలు శక్తివంతంగా ఉపయోగపడుతాయి. వీలైతే మానసిక వైద్య నిపుణులచే కౌన్సెలింగ్‌ ఇప్పించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement