వీరలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

వీరలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు

Oct 13 2026 1:41 AM | Updated on Oct 13 2026 1:41 AM

వీరలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు తాడేపల్లి రూరల్‌: ీసతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై వీరలక్ష్మి అమ్మవారికి సోమవారం విశేష పూజలు నిర్వహించారు. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి వారి మంగళాశాసనములతో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు వీరలక్ష్మి అమ్మవారికి ఉదయం 9 గంటలకు విశేష అభిషేక మహోత్సవం, కుంకుమార్చన శాస్త్రోక్తంగా నిర్వహించామని తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, వీరలక్ష్మి అమ్మవారి పల్లకి సేవ, అర్చన, నివేదన, మంగళాశాసనం కార్యక్రమాలు వైభవంగా జరిగాయని తెలిపారు. భ్రమరాంబ అమ్మవారికి మంగళసూత్రాలు బహూకరణ గుంటూరు రైల్వేస్టేషన్‌లో ‘జన్‌ సంవాద్‌’

పెదకాకాని: పెదకాకాని శివాలయంలో భ్రమరాంబ అమ్మవారికి గుంటూరు జిల్లా దొండపాడు గ్రామానికి చెందిన నెలకుడిటి పార్వతి రూ.2,51,820 విలువైన 15 గ్రాముల 455 మిల్లీ గ్రాముల మంగళ సూత్రాలను సోమవారం అందజేశారు. పాలకమండలి సభ్యులు బండారు మల్లేశ్వరి, కొండా లత, పాముదుర్తి నాగలక్ష్మి ద్వారా దేవస్థాననానికి అందించినట్లు ఆలయ ఉప కమిషనర్‌ గోగినేని లీలాకుమార్‌, పాలకమండలి చైర్మన్‌ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. దాత కుటుంబ సభ్యులకు ప్రత్యేక దర్శనం, ఆలయ అర్చకస్వాములు, వేదపండితులచే వేద ఆశీర్వచనం చేయించారు. స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, ప్రసాదం, చిత్రపటం అందజేశారు.

లక్ష్మీపురం: ప్రయాణికులతో సంబంధాలను బలోపేతం చేయడం, రైల్వే సేవలను మెరుగుపర్చే లక్ష్యంతో జన సంవాద్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఆర్‌ఎం సుథేష్ణ సేన్‌ అన్నారు. గుంటూరు రైల్వేస్టేషన్‌లో సోమవారం సాయంత్రం జన్‌ సంవాద్‌ కార్యక్రమం నిర్వహించారు. రైల్వే స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులతో డీఆర్‌ఎం మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా రైళ్లలో జనరల్‌ బోగీల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరారు. పెరిగిన ప్రయాణికుల డిమాండ్‌ను తీర్చడానికి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించడానికి ’ట్రెయిన్‌ ఆన్‌ డిమాండ్‌’ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు డీఆర్‌ఎం తెలిపారు. కార్యక్రమానికి డివిజన్‌ సంబంధిత విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు వార్డు కార్యదర్శుల సస్పెన్షన్‌

నెహ్రూనగర్‌: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వార్డు అడ్మిన్‌ కార్యదర్శులను విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు నగర కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈఆర్‌పీ విధానంలో ఆస్తిపన్ను సేవలను గడువు దాటినా పెండింగ్‌లో ఉంచిన ఆటోనగర్‌–02 సచివాలయ కార్యదర్శి డి.పద్మావతి 103 దరఖాస్తులను, కొండవారివీధి–03 సచివాలయ కార్యదర్శి కె. సుందర్‌ సింగ్‌ 58 దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. గతంలో వీరికి జారీ చేసిన షోకాజ్‌ నోటీసులకు ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేకపోవడంతో, ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌ ప్రకారం సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌ కాలంలో వీరు గుంటూరు హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని స్పష్టం చేశారు. ప్రజా సేవల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని కమిషనర్‌ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement