సమన్వయంతో సమస్యలకు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో సమస్యలకు పరిష్కారం

Oct 13 2026 1:41 AM | Updated on Oct 13 2026 1:41 AM

● జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ● పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు స్వీకరణ

బాపట్ల: అధికారులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలు, సమన్వయం ఉండాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల సమస్యలను అధికారులు సానుకూల దృక్పథంతో స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. గడిచిన వారంలో పీజీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంలో అత్యుత్తమ సేవ కనబరిచిన రేపల్లె రెవెన్యూ డివిజనల్‌ అధికారి బి.శ్రీదేవిని జిల్లా కలెక్టర్‌, జిల్లా సంయుక్త కలెక్టర్‌లు శాలువా మరియు జ్ఞాపికతో సత్కరించారు. అదేవిధంగా ఓటర్ల నమోదు అవగాహన కార్యక్రమాలపై ఎన్నికల అక్షరాస్యత క్లబ్‌ ద్వారా అన్ని కళాశాలల్లోని విద్యార్థులకు వేర్వేరుగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన వారికి కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌, జేసీ భావన వశిష్ట చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు, మొమెంటోలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement