చీరాల రూరల్: బీచ్ ఫుట్బాల్ విజేతగా ఎన్టీఆర్ జిల్లా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల రామాపురం బీచ్లో మూడు రోజులుగా ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ బీచ్ ఫుట్బాల్ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం రాత్రితో ఉత్సాహంగా ముగిశాయి. ఈ పోటీల్లో మొత్తం 17 జిల్లాల క్రీడా జట్లు పాల్గొన్నారు. క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్లో తమ ప్రత్యర్థి జట్లను మట్టికరిపించిన విశాఖపట్టణం–ఎన్టీఆర్ జిల్లాల జట్లు ఫైనల్కు చేరాయి. ఫైనల్లో జరిగిన మ్యాచ్లో ఇరు జట్లు విజేత నువ్వానేనా అన్నట్లుగా చిరుతపులుల్లా పోరాడాయి. చివరకు ఎన్టీఆర్ జిల్లాజట్లు 1–0 గోల్స్ తేడాతో వైజాగ్ జట్టును ఓడించి విజేతగా నిలిచి మొదటి బహుమతిని కై వసం చేసుకుంది. విజేతగా నిలిచిన జట్టుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎం. కొండయ్య బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నూతలపాటి దేవదాసు, విజయ్ కుమార్, బాలశౌరి, బాలాజీ, దీవెనయ్య, అగస్టీన్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.


