చినగంజాం: 36వ అంతర్ రాష్ట్ర సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో బాపట్ల జిల్లా పురుషుల కబడ్డీ జట్టు ప్రథమస్థానం కై వసం చేసుకుంది. ఏలూరు జిల్లా నూజివీడులో ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించిన పోటీ ల్లో బాపట్ల జట్టు 6 జిల్లాల జట్లతో తలపడి విజయం సాధించింది. మొదటి మ్యాచ్ ననెల్లూరు జిల్లా జట్టుపై 40–48 పాయింట్లతో, రెండో మ్యాచ్ అనంతపురం జిల్లా జట్టుపై 8–40 పాయింట్లతో గెలిచి ప్రీ క్వార్టర్ చేరుకుంది. అనకాపల్లి జిల్లా జట్టుతో తలపడి 46–48 పాయింట్లతో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొని విశాఖ జిల్లా జట్టుతో తలపడి 35–45 పాయింట్లతో గెలుపొంది సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. తిరుపతి జిల్లా జట్టుతో తలపడి 30–45 పాయింట్లతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌లో నెల్లూరు జిల్లా జట్టుతో తలపడిన బాపట్ల జిల్లా సబ్ జూనియర్ పురుషుల జట్టు 37–51 పాయింట్లతో విజయం సాధించి ప్రథమ బహుమతిని కై వసం చేసుకుంది. జిల్లా జట్టు విజయం సాధించి కప్ గెలుచుకోవడంతో బాపట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు నక్కల అర్జునరావు, కార్యదర్శి మంతెన సుబ్బరాజు, మిషన్ ఫౌండర్ కొట్టే ఏడుకొండలు, కోచ్ కోట హరిప్రసాద్‌రెడ్డి క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు.


