బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యం

Oct 13 2026 1:41 AM | Updated on Oct 13 2026 1:41 AM

బాపట్ల: బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన 52 మంది అర్జీదారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అర్జీదారులు సమస్యలను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, చట్ట పరిధిలో పరిష్కరించాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుపై నిర్ణీత కాలపరిమితిలో సమగ్ర విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కోరారు. బాధితులు అందజేసిన అర్జీలలో అత్యధికంగా కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మోసాలు, కుటుంబ కలహాలు వంటి సమస్యలే ఉన్నాయని తెలిపారు. పోలీస్‌ యంత్రాంగం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. అర్జీలు పదేపదే పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. బాధితుల సమస్యల పరిష్కారంలో ఎటువంటి అలసత్వాన్ని సహించబోమని ఎస్పీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ఎల్‌.సుధాకర్‌, బాపట్ల డీఎస్పీ సిహెచ్‌.చంద్రమౌళి, పీజీఆర్‌ఎస్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement