బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Oct 12 2026 2:49 AM | Updated on Oct 12 2026 2:49 AM

సోమవారం శ్రీ 12 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 పులిచింతల సమాచారం పశ్చిమ డెల్టాకు నీటి విడుదల సాగర్‌ నీటిమట్టం

న్యూస్‌రీల్‌

కనుల పండువగా ఆది దంపతుల నగరోత్సవం

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు ప్రారంభం

సోమవారం శ్రీ 12 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

7

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.9578 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్‌ నుంచి పశ్చిమ డెల్టాకు 2,423 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

మాచర్ల: నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ నీటిమట్టం ఆదివారం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 540.30 అడుగులకు చేరుకుంది.

వేద మంత్రాల నడుమ.. మంగళవాయిద్యాల సవ్వడితో.. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా దర్శనమివ్వడంతో కొండంతా భక్తిభావంతో పులకించిపోయింది. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మరోవైపు ప్రముఖుల రాక, సిఫార్సు దర్శనాల మధ్య సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆంక్షలు, రద్దీ నడుమ భక్తుల గంటల తరబడి నిరీక్షించారు.

ఇంద్రకీలాద్రి, వన్‌టౌన్‌ (విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజు ఆదివారం అమ్మవారు శ్రీబాలాత్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం ఒక్క రోజే సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. తెల్లవారుజామున 2 గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవ అనంతరం స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 8.30 గంటలకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి తొలి దర్శనం మంత్రి సుభాష్‌, కలెక్టర్‌ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, ఆలయ ఈవో శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణ చేసుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ప్రధాన ఆలయం నుంచి అమ్మవారి ఉత్సవమూర్తిని నూతన పూజామండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్టించారు. పూజా మండపంలో గణపతి పూజ చేశారు. బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దుర్గమ్మను శాసనసభ డెప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు, పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక శత చండీహోమం, ప్రత్యేక శ్రీచక్రనవార్చనలను నిర్వహించగా, పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. ఉభయదాతలను ప్రత్యేక క్యూలో దర్శనానికి అనుమతించారు.

లిప్టులు, అనధికార దర్శనాలు యఽథాతథం

క్యూలో విచ్చేసే వారికే తొలి ప్రాధాన్యమిస్తామని చెప్పిన ఆలయ అధికారులు ఆచరణలో మాత్రం అమలు కాలేదు. ఉత్సవాల్లో తొలి రోజే లిఫ్టుల ద్వారా తమకు కావాల్సిన వారిని పోలీసు, దేవస్థాన కమిటీ సభ్యులు యథేచ్ఛగా కొండపైకి తీసుకువెళ్లి దర్శనాలు చేయించారు. మరోవైపున ప్రజాప్రతినిధుల తరఫున సేవా దళం ఆలయ పరిసరాల్లో తిరుగుతూ తమ వారికి దర్శనాలు చేయిస్తున్నారు. వన్‌టౌన్‌లోని ఓ సత్రంకు చెందిన సభ్యుడు సైతం ప్రొటోకాల్‌ డ్యూటీ చేయడం గమనార్హం. మెడలో కండువా, ఐడీ కార్డును ధరించి దర్జాగా దర్శనాలు చేయిస్తున్నా అడ్డుకునే వారే లేకపోయారు. వీకెండ్‌, వరస సెలువులు, దసరా ఉత్సవాలు ఆదివారం ప్రారంభం కావడంతో ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు.

పట్టువస్త్రాలు సమర్పణ

ఉత్సవాల్లో భాగంగా బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారికి కాళహస్తి, కాణిపాకం దేవస్థానాల నుంచి పట్టువస్త్రాలను సమర్పించారు. కాళహస్తి ఈవో బీకే వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, పాలక మండలి సభ్యులు పట్టువస్త్రాలతో దుర్గగుడికి చేరుకోగా, ఆలయ చైర్మన్‌ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, అమ్మవారికి పట్టుచీర, పూజా సామగ్రి, సారెను సమర్పించారు.

పని చేయని ఆన్‌లైన్‌ కౌంటర్లు

అమ్మవారి లడ్డూ ప్రసాదాలు విక్రయించే ఆన్‌లైన్‌ కౌంటర్లు పని చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. దసరా ఉత్సవాలలో భాగంగా దేవస్థానం నాలుగు ఆన్‌లైన్‌ కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సర్వర్‌ పని చేయలేదు. ఈ సమస్యపై ఈవో శీనానాయక్‌ టెక్నికల్‌ సిబ్బందితో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాయంత్రం వరకు సమస్య పరిష్కారం కాలేదు.

ఆదివారం ఉదయం 8.30 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభమవ్వగా అప్పటికే వినాయకుడి గుడి వరకు క్యూలు నిండుకున్నాయి. భక్తులను సీతమ్మ వారి పాదాలు, వీఎంసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హోల్డింగ్‌ పాయింట్లకు మళ్లించారు. మరో వైపున అర్ధరాత్రి 2 గంటలకే క్యూలలో వేచి ఉన్న భక్తులు ఆలయం వద్దకు చేరుకునే సరికి ఉదయం 11 గంటలైంది. బయట వాతావరణం వేడిగా, ఉక్కపోతగా ఉండటంతో క్యూలో ఉన్న చిన్న పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దసరా ఉత్సవాల తొలి రోజు అధిక సంఖ్యలో వీఐపీలు, ప్రముఖులు, సిఫార్సులు ఉన్న వారు ఆలయానికి చేరుకోవడంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. దీంతో క్యూ అడుగు ముందుకు వేయాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు ఆదివారం సాయంత్రం నగరోత్సవ సేవ కనులపండువగా సాగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పాత యాగశాల నుంచి ప్రారంభమైన ఊరేగింపు కనకదుర్గనగర్‌, రఽథం సెంటర్‌, వినాయకుడి గుడి, కెనాల్‌రోడ్డు, దుర్గాఘాట్‌, ఘాట్‌రోడ్డు మీదగా ఆలయానికి చేరుకుంది. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ భక్తజనుల కోలాట నృత్యాలు, వివిధ కళాకారుల నృత్యాలు, కేరళ వాయిద్యాలు, శాక్సాఫోన్‌ నాదంతో ఊరేగింపు కనులపండువగా సాగింది. నగరోత్సవ సేవలో దసరా ఉత్సవాల ఫెస్టివల్‌ ఆఫీసర్‌ ఆజాద్‌, చైర్మన్‌ రాధాకృష్ణ, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

బాలాత్రిపురసుందరిగా

దుర్గమ్మ దర్శనం

భక్తజనులకు కనుల పండువ

లిప్టుల వినియోగం, సిఫార్సు దర్శనాలు

సామాన్య భక్తులకు ఇక్కట్లు

అర్చకులు, మీడియాకు తప్పని ఆంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement