దర్గాను తొలగించే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

దర్గాను తొలగించే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి

Oct 12 2026 2:49 AM | Updated on Oct 12 2026 2:49 AM

వైఎస్సార్‌ సీపీ నాయకుల డిమాండ్‌ దర్గాను సందర్శించిన షేక్‌ నూరి ఫాతిమా, వేణు గోపాల సోమిరెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి

మంగళగిరి రూరల్‌: రాజధాని ప్రాంతంలో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు ఎన్‌– 13 నిర్మాణం కోసం నవులూరులోని హజరత్‌ సయ్యద్‌ మాలిక్‌ హుస్సేన్‌ బాబా దర్గాను తొలగించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్‌ నూరి ఫాతిమా డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ నాయకుల బృందం దర్గాను ఆదివారం సందర్శించింది. పూలు, చాదర్‌, సందల్‌ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా ట్రస్టీలు దర్గాను పరిరక్షించాలని చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా షేక్‌ నూరి ఫాతిమా మాట్లాడుతూ, ఫ్లైఓవర్‌ నిర్మాణానికి డిజైన్‌ రూపొందించే సమయంలోనే ప్రార్థనా స్థలాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. ఇప్పుడు దర్గా ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి అడ్డుగా ఉందని పేర్కొనడం సరికాదని హితవు పలికారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పునఃపరిశీలించి దర్గా పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరారు. పార్టీ మంగళగిరి సమన్వయకర్త బుర్ర ముక్కు వేణుగోపాల సోమిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనుల సమయంలో ప్రజల ఆస్తులకు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. దర్గా తొలగింపు ప్రతిపాదనను వెనక్కి తీసుకుని, దాని పరిరక్షణపై మంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ మైనారిటీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి షేక్‌ బాజీ షహిద్‌ మాట్లాడుతూ, సూఫీ మహాత్ముని దర్గాకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని, దాన్ని తొలగించే ప్రతిపాదనను భక్తులు, స్థానిక ప్రజలు అంగీకరించరని అన్నారు. కార్యక్రమంలో దర్గా ట్రస్టీలు మహమ్మద్‌ ఉస్మాన్‌ షరీఫ్‌, మహమ్మద్‌ హుస్సేన్‌ షరీఫ్‌, వైఎస్సార్‌ సీపీ మైనారిటీ ప్రధాన కార్యదర్శులు మహమ్మద్‌ గోరేబాబు, నసీముల్లా, జిల్లా అధ్యక్షుడు పఠాన్‌ సైదా ఖాన్‌, నియోజకవర్గ అధ్యక్షుడు షేక్‌ జానీబాషా, యువజన అధ్యక్షుడు సయ్యద్‌ గౌస్‌ మొయిద్దీన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు షేక్‌ సుభాని, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.డేవిడ్‌ రాజ్‌, దుగ్గిరాల మాజీ యార్డు చైర్మన్‌ షేక్‌ బాజీ, మంగళగిరి మండల అధ్యక్షుడు షేక్‌ రఫీ, తాడేపల్లి అధ్యక్షుడు షేక్‌ హుస్సేన్‌, ఎరబ్రాలెం గ్రామ అధ్యక్షుడు షేక్‌ బడే మియా, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్‌, మంగళగిరి రూరల్‌ పార్టీ అధ్యక్షుడు నాలి వెంకటకృష్ణ, మైనారిటీ విభాగం దుగ్గిరాల మండల అధ్యక్షుడు షేక్‌ అబ్దుల్‌ నజీర్‌, రాష్ట్ర ప్రచార విభాగ కార్యదర్శి మల్లవరపు చిన్ని, డాక్టర్స్‌ వింగ్‌ అధ్యక్షుడు మెరుగు నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు షేక్‌ సుభాని పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement