చికిత్స పొందుతూ మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ మహిళ మృతి

Oct 12 2026 2:49 AM | Updated on Oct 12 2026 2:49 AM

వైద్యుడి నిర్లక్ష్యం అంటూ బంధువుల ఆరోపణ మృతదేహంతో ఆసుపత్రి వద్ద అందోళన

మార్టూరు(యద్దనపూడి): చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళ అర్ధాంతరంగా మృతి చెందిన సంఘటన మార్టూరులో ఆదివారం జరిగింది. మృతురాలి బంధువులు ఆసుపత్రి వైద్యుడి వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక అంబేడ్కర్‌ కాలనీకి చెందిన తాతపూడి చిన్నమ్మాయి (46) అనారోగ్యంతో బాధపడుతుండగా ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు స్థానిక జాతీయ రహదారి పక్కన గల కార్తీక్‌ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకొని వచ్చారు. ఆసుపత్రి వైద్యుడు కోవూరి కార్తీక్‌ చిన్నమ్మాయికి రెండుసార్లు పరీక్షలు చేసి సైలెన్‌ పెట్టి ఆరోగ్యం కుదుటపడిందని టాబ్లెట్లు రాసి మధ్యాహ్నం ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లాక టాబ్లెట్‌ వేసుకున్న చిన్నమ్మాయికి తిరిగి అనారోగ్యం తిరగబెట్టడంతో బంధువులు హడావుడిగా మరల ఆసుపత్రికి తరలించారు. చిన్నమ్మాయిని పరిశీలించిన డాక్టర్‌ కార్తీక్‌ పరిస్థితి విషమంగా ఉందని చెబుతూ చిలకలూరిపేట ప్రైవేట్‌ హాస్పిటల్‌ తీసుకు వెళ్ళవలసిందిగా సూచించారు. ఈ క్రమంలో చిలకలూరిపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి చిన్నమ్మాయిని తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పేషెంట్‌కు ఉదయం అంతా బాగానే ఉందని డాక్టర్‌ కార్తీక్‌ పంపించగా ఆయన ఇచ్చిన మందులు వాడటం వల్లే చిన్నమ్మాయి మృతి చెందిందని అందుకు ఆసుపత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలంటూ మృతురాలి బంధువులు ఆదివారం రాత్రి చిన్నమ్మాయి మృతదేహంతో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.ఈ విషయమై మీడియా ప్రతినిధులు వైద్యుడు కార్తీక్‌ను వివరణ కోరగా తనను ఇంతవరకు మృతురాలి బంధువులు సంప్రదించలేదని తానేమి చెప్పలేదని చెప్పడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement