తాడేపల్లిలో సెంటినీ శ్రీమాన్‌ హాస్పిటల్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

తాడేపల్లిలో సెంటినీ శ్రీమాన్‌ హాస్పిటల్‌ ప్రారంభం

Oct 12 2026 2:49 AM | Updated on Oct 12 2026 2:49 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): సెంటినీ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి సర్వీసు రోడ్డులో 150 పడకలు, అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన సెంటినీ డాక్టర్‌ శ్రీమాన్‌ హాస్పిటల్‌లో ఆదివారం లాంఛనంగా సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సెంటినీ హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ మొవ్వ పద్మ మాట్లాడుతూ.. వైద్య రంగంలో రెండు దశాబ్ధాలుగా విశేష అనుభవం కలిగిన నిపుణుల నేతృత్వంలో అత్యాధునిక ప్రమాణాలు, అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను ఈ నూతన ఆస్పత్రిలో అందించనున్నట్లు తెలిపారు. గుండె వైద్యంలో విశేష అనుభవం గడించిన డాక్టర్‌ జె.శ్రీమన్నారాయణ నేతృత్వంలో పూర్తిస్థాయి కార్డియాలజీ బృందం సేవలు అందిస్తుందన్నారు. అదే విధంగా జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ఎన్‌ జగదీష్‌, న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ లావు హరీష్‌ వంటి నిపుణులు నిరంతరం అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో అండ్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పల్మనాలజీ, క్రిటికల్‌ కేరర్‌, గైనకాలజీ, జనరల్‌ మెడిసిన్‌ విభాగాల్లో సేవలు అందించనున్నట్లు తెలిపారు. వైద్యులు శ్రీమన్నారాయణ, జగదీష్‌ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంత పరిసర జిల్లాల వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. సమావేశంలో జనరల్‌ మెడిసిన్‌ నిపుణులు డాక్టర్‌ తుళ్లూరి రేష్మా చౌదరి, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ఎన్‌.మాధురి, రేడియాలజిస్ట్‌ డాక్టర్‌ సుషేన్‌, ఆస్పత్రి చైర్మన్‌ మొవ్వ ఆనంద్‌, డైరెక్టర్‌ మొవ్వ విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement