రేపల్లె: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు, సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్‌న్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణంలో శనివారం జరిగిన ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ బాపట్ల జిల్లా రెండవ మహాసభలలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సేవలందించడంలో అంగన్‌వాడీ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారన్నారు. కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. అంగన్‌వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీలను నెరవేర్చి, వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల సాధనకై అసోసియేషన్ నిరంతరం ఉద్యమాలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు, అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే.ప్రేమ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శామ్యూల్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కార్యవర్గం ఎన్నిక
మహాసభలో ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషనన్ బాపట్ల జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా పి.అంజలీదేవి, కార్యదర్శిగా సింగం వాణిశ్రీలతోపాటు ఏడుగురు సభ్యులను ఎన్నుకున్నారు.
ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్
అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలితమ్మ


