సిబ్బంది సమస్యల పరిష్కారమే ఓపెన్‌ హౌస్‌ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది సమస్యల పరిష్కారమే ఓపెన్‌ హౌస్‌ లక్ష్యం

Oct 11 2026 5:18 AM | Updated on Oct 11 2026 5:18 AM

బాపట్లటౌన్‌: పోలీస్‌ సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారమే పోలీస్‌ సహచార్‌ ఓపెన్‌ హౌస్‌ లక్ష్యమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ‘పోలీస్‌ సహచార్‌ ఓపెన్‌ హౌస్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి నెలా రెండవ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సిబ్బంది తమ వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 3.00 నుంచి 5.00 గంటల వరకు ‘ఎస్పీ సంపర్క్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీస్‌ సిబ్బంది నేరుగా ఫోన్‌ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. కార్యక్రమంలో అడ్మిన్‌ ఆర్‌ఐ షేక్‌ మౌలుద్దీన్‌, సీసీ హరికృష్ణ, డీపీఓ సిబ్బంది, ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement