రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Sep 1 2026 1:49 AM | Updated on Sep 1 2026 1:49 AM

రేపల్లె: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరో ఇరువురు తీవ్ర గాయాలపాలైన సంఘటన పెనుమూడి రోడ్డులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన నడకుదుటి సాయిచరణ్‌ (22) తన ద్విచక్రవాహనంపై రేపల్లె నుంచి అవనిగడ్డ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రావెల్స్‌ బస్సును తప్పించబోయాడు. ఈ క్రమంలో అదుపు తప్పి ముందున్న కారును ఢీకొన్నాడు. ఢీకొన్న వేగంతో సాయిచరణ్‌ వెనుక నుంచి వస్తున్న మరో ద్విచక్ర వాహనంపై పడిపోయాడు. ఆ వాహనంపై ప్రయాణిస్తున్న దేవరపల్లి నాగయ్య, మోళ్లగుంట పీహెచ్‌సీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న పార్వతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్‌న్స్‌లో బాధితులను రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయిచరణ్‌ మృతి చెందగా తీవ్రంగా గాయపడిన నాగయ్య, పార్వతిలకు ప్రథమ చికిత్సలు నిర్వహించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్‌కుమార్‌ చెప్పారు.

ఇరువురికి తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement