అగ్గి పెట్టె కోసం ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

అగ్గి పెట్టె కోసం ఘర్షణ

Aug 30 2026 4:49 AM | Updated on Aug 30 2026 4:49 AM

అగ్గి పెట్టె కోసం ఘర్షణ

కత్తితో దాడి–వ్యక్తి మృతి

వేమూరు: అగ్గి పెట్టె అడిగితే ఇవ్వలేదని కత్తితో దాడి చేయగా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు.. వేమూరు మండలం వెల్లబాడు గ్రామానికి చెందిన ఈపూరు యోహాన్‌(46) శుక్రవారం రాత్రి 10 గంటలకు మద్యం తాగి లైబ్రరీ వద్ద ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన చెదుర్తి చరణ్‌తేజ లైబ్రరీ వద్దకు వచ్చాడు. యోహాన్‌, చరణ్‌ తేజను అగ్గి పెట్టె అడిగాడు. ఇద్దరు మధ్య గొడవ జరిగింది. యోహాన్‌ తరపున కొంత మంది వచ్చి చరణతేజను కొట్టారు. చరణ్‌ తేజ పక్కన ఉన్న ఇంటిలోకి వెళ్లి చాకు తీసుకొని వచ్చి యోహాన్‌ ఛాతీ వెనుక భాగంలో పొడిచాడు. గ్రామస్తులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. 108 వాహనంలో యోహాన్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. గ్రామస్తులు సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. చరణ్‌తేజ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. మృతుడి భార్య, కుమారుడు దివ్యాంగులన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement